శృంగారంలో రెచ్చిపోవాలా..? అశ్వగంధ వాడితే సరి..!

First Published | May 8, 2021, 1:57 PM IST

ఎన్నో రకాల సెక్స్ సమస్యలకు అశ్వగంధ పరిష్కారంగా పనిచేస్తుంది. అశ్వగంధలోని ఔషధ గుణాలు పురుషాంగానికి బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా సెక్స్ లో ఫిజికల్ ఫిట్నెస్ కూడా సాధ్యమౌతుంది.
 

శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే.. మనం తీసుకునే ఆహారం.. లేదా కొన్ని కారణాల వల్ల దానిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నవారు చాలా మంది ఉన్నారు.
మరీ ముఖ్యంగా అంగస్థంభన సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ అంగస్తంభనకు పని ఒత్తిడి, మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అసలు కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అంటే.. ఆయుర్వేదంతో పరిష్కారం పొందవచ్చని చెబుతున్నారు.

డయాబెటిక్స్, హైబీపీ, హైపోథైరాయిడ్, ఎక్కువగా మందులు తీసుకోవడం, మద్యం సేవించడం ఇలాంటి కారణాల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఎన్నో రకాల సెక్స్ సమస్యలకు అశ్వగంధ పరిష్కారంగా పనిచేస్తుంది. అశ్వగంధలోని ఔషధ గుణాలు పురుషాంగానికి బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా సెక్స్ లో ఫిజికల్ ఫిట్నెస్ కూడా సాధ్యమౌతుంది.
తరచూ అంగస్తంభన సమస్యతో పోరాడే వారికి అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఇది మార్కెట్లో టాబ్లెట్ రూపంలోనూ లభిస్తోంది. పౌడర్ కూడా లభిస్తుంది. డాక్టర్ ని సంప్రదించి దానిని ఎంత డోస్ తీసుకోవాలో తెలుసుకోని ఉపయోగించాలి.
లైంగిక సామర్థ్యాన్ని అశ్వగంధ చూర్ణం పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నరాల బలహీనతను ఈ చూర్ణం దూరం చేస్తుంది.
వంద గ్రాముల అశ్వ‌గంధ పొడిని తీసుకుని అందులో పావు కిలో నెయ్యిని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ ఒక టీస్పూన్ చొప్పున ఒక గ్లాసు వేడి పాలు లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని.. వీర్య లోపాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే అశ్వగంధ చూర్ణాన్ని పది గ్రాముల మోతాదులో తీసుకుని అరగ్లాసు వేడిపాలలో కలిపి మహిళలు రుతుక్రమం అయిన నాలుగో రోజు నుంచి తీసుకుంటే సంతాన లేమిని దూరం చేసుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
అశ్వ‌గంధ చూర్ణం, నెయ్యి, చ‌క్కెర‌ల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తుంటే త‌ద్వారా పురుషుల్లో వీర్య క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. అశ్వగంధ పొడిని ఐదు గ్రాములు, పటిక బెల్లం పొడి ఐదు గ్రాములు కలిపి మహిళలు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే అధిక రక్తస్రావం క్రమం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!