నీరసంగా ఉందా..? సెక్స్ మీద ఆసక్తి కూడా తగ్గిందా..? ఇదిగో పరిష్కారం..!

First Published | May 7, 2021, 1:15 PM IST

వాస్తవానికి, యాలకులులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరానికి ఇవి చాలా మేలు చేస్తాయి.

అనుకోకుండా బాగా నీరసపడిపోతున్నారా..? శృంగారం విషయంలోనూ ఎలాంటి ఆసక్తి ఉండటం లేదా..? అయితే.. ఇది కచ్చితంగా మీకోసమే. ఓ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అది మరెంటో కాదు.. యాలకులు. ఇవి దాదాపు స్వీట్ల తయారీల్లో వాడుతుంటాం. అయితే.. దీనిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి, యాలకులులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన శరీరానికి ఇవి చాలా మేలు చేస్తాయి.
యాలకులను చాలా రకాలు తీసుకోవచ్చు. నేరుగా కూడా వాటిని తినేయవచ్చు. నోరు కూడా చాలా తాజాగా ఉంటుంది. లేదా ఏదైనా స్వీట్, కూరల్లో కూడా వీటిని వేసుకొని వండుకొని తినొచ్చు.
ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఇది పనిచేస్తుంది. రాత్రి పడుకోవడానికి ముందు మూడు యాలకులను వేడి నీటిలో వేసుకొని మరగ పెట్టుుకొని... ఆ తర్వాత తాగాలి. ఇలా రాత్రి పూట తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
రాత్రిపూట యాలకులు తింటే.. నిద్రలో గురక సమస్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. గ్యాస్, ఎసిడిటీ, అరుగుదల, మలబద్దకం లాంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.
పురుషులు కచ్చితంగా రాత్రిపూట మూడు యాలకులు తినాలట. అలా తినడం వల్ల వారికి చాలా ప్రయోజనాలు చేకూరతాయట. వారిలోని చాలా సమ్యలకు ఇవి పరిష్కారం చూపిస్తాయి. నీరసాన్ని కూడా వెంటనే తగ్గిస్తాయి.
పాలు, మంచినీటిలో కలిపి యాలకులు తీసుకోవడం వల్ల శృంగార ఆసక్తితో పాటు.. శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి వేసుకొని తాగితే.. ప్రశాంతమైన నిద్రపట్టడంతోపాటు.. గురక సమస్య తగ్గుతుంది.
శరీరంలో చేరిన క్యాన్సర్ కణాలను సైతం తగ్గించే సత్తా దీనికి ఉంది.
ఓరల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ లపై ఇది పోరాడుతుంది.
మీరు అధిక బరువు, ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే.. కచ్చితంగా మీ డైట్ లో యాలకులు ఉండాలి. దీని వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు.

Latest Videos

click me!