నోటికి రుచి ఎంతో అవసరం. రుచిగా లేకుండా మనం భోజనం చేయగలమా..? రుచిగా ఉండటమే కాదు.. రక రకాల రుచులను రుచి చూడాలని మనం ఉత్సాహపడుతుంటాం. అయితే.. కేవలం రుచి నాలుకకే ఉంటే సరిపోతుందా.. పడక సుఖానికి కూడా కమ్మని రుచి ఉండాల్సిందేనంటున్నారు రసికులు.
అందుకే.. శృంగార సమయంలో ఉపయోగించే కండోమ్స్ లో ఇప్పటికే స్ట్రాబెర్రీ, చాక్లెట్ లాంటి ఫ్లేవర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే ఎలా సరిపోతాయని.. ఈ కండోమ్స్ లో కూడా కాస్త ఘాటు పెంచారు.
అర్థం కాలేదా..? ఇప్పటి వరకు చాక్లెట్,స్ట్రాబెరీ ఫ్లేవర్స్ లో కండోమ్స్ దొరికాయి కదా.. తాజాగా.. అల్లం, చికెన్ టిక్కా మసాలా పేరిట కొత్త రకం కండోమ్స్ ని పరిచయం చేశారు.
వినియోగదారుల అభిరుచులు, ఆసక్తులను కంపెనీలు గుర్తిస్తున్నాయి. డిమాండ్‌ను బట్టి కండోమ్ కంపెనీలు ప్రతిసారీ కొత్త ఫ్లేవర్లలో సృజనాత్మకంగా వాటిని రూపొందిస్తున్నాయి.
కండోమ్‌లు తయారుచేసే ఒక కంపెనీ, ఈ శీతాకాలంలో అల్లం ఫ్లేవర్ కండోమ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
దీని వివరాలన్నీ, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో ఇచ్చింది. ఈ కొత్తం ఫ్లేవర్ కండోమ్ ఫొటో పోస్ట్ చేస్తూ ఈ కింది వాక్యాలు జతపరిచింది."తేలికైన గొంతు కోసం అల్లం, తేనె. ప్రవేశపెడుతున్నాం అల్లం ఫ్లేవర్." అని ప్రకటించింది.
వంకాయ ఫ్లేవర్.. వంకాయ ఫ్లేవర్ తో కూడా కండోమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డ్యూరెక్స్ కంపెనీ పరిచయం చేసింది. కొత్త రకం ఫ్లేవర్లను కోరుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు.
చికెన్ టిక్కా మసాలా ఫ్లేవర్.. నాన్‌వెజ్ లో చికెన్ టిక్కా మసాలాను ఇష్టపడనివారు ఉండరు. శృంగారంలోనూ ఆ ఫ్లేవర్‌ను ఎందుకు ఆస్వాదించకూడదని డ్యూరెక్స్ కంపెనీ ఆలోచించింది. కొత్తగా, ప్రత్యేకంగా ఉండే చికెన్ టిక్కా మసాలా ఫ్లేవర్ కండోమ్‌ను ఆ సంస్థ విడుదల చేసింది
బిర్యానీ ఫ్లేవర్ కండోమ్.... అన్ని రకాల నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రత్యేకించి హైదరాబాద్‌లో దీనికి ఎంతో ఆధరణ ఉంటుంది. ఆ రుచిని శృంగారం సమయంలోనూ ఆస్వాదించాలనే ఉద్దేశంతో మ్యాన్‌ఫోర్స్ బిర్యానీ ఫ్లేవర్ కండోమ్‌ను పరిచయం చేసింది.
కోహినూర్ పాన్ కండోమ్.. ఈ పాన్ చాలా రుచిగా ఉంటుందట. ఇప్పుడు ఈ ఫ్లేవర్ లో కూడా కండోమ్ తయారు చేశారు.