ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు.
అందుకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి శృంగారం కూడా ఒక వ్యాయామం. ఇది అందరికీ తెలిసిందే. ఇక రెండోది శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్ సంతరించుకుంటుంది.
వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్ చేసినట్టే. ఇక మూడవది శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది.
శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నాలుగవ కారణం దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం, గుండెజబ్బులు లాంటి సమస్యల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు.
సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడంవల్ల ఈ కాలంలో చాలామంది సతమత మవుతున్నారు. శృంగార సమయంలో భాగస్వామి అసంతృప్తికి లోనుకావడంవల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి.
అసలు ఈ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? దీనికి కారణాలేమిటి అంటే..ఆహారం ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అదీ కాక అనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువ శాతం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది.
అనారోగ్యం కూడా సెక్స్‌లైఫ్‌ను ఎంజాయ్ చేయకుండా అడ్డుకుంటుంది. అందువల్ల తగిన మోతాదులో తీసుకునే పోషకాహారమే మన శృంగార జీవితాన్ని, శృంగార సామర్ధ్యాన్ని వృద్ధిచేస్తుంది.