ఒకరాత్రి పడక సుఖం.. లాభమేంటి..? నష్టమేంటి..?

First Published | Sep 11, 2021, 11:10 AM IST

అబ్బాయిల విషయానికి వస్తే... ఎక్కువ మంది సెక్స్ చేయాలన్న ఫాంటసీ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే దీని కోసం ఆశ పడుతుంటారు.


వన్ నైట్ స్టాండ్స్... ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు. దీనిని కొందరు ఇష్టంగా ఎంజాయ్ చేస్తుంటే.. కొందరు దీని వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.  అసలు ఏంటీ వన్ నైట్ స్టాండ్స్..? దీని వల్ల కలిగే లాభం ఏంటి..? కలిగే నష్టం ఏంటో చూద్దాం..

ఒక రాత్రి సంబంధం. తెల్లారగానే, ఎవరికివారే. ఎవరి జీవితాలు వారివే. మళ్లీ కలుసుకోవచ్చూ, కలుసుకోలేకపోవచ్చూ. కలుసుకుంటే వారికి నచ్చితే వారి బంధాన్ని కొనసాగించొచ్చు. నచ్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. కల్చర్ లైఫ్ అనే పేరిట వన్ నైట్ స్టాండ్ పేరిట పరాయి స్త్రీ తో ఎంజాయ్ చేస్తున్నారు.


దీనికి కారణాలు అనేకమున్నాయంటున్నారు నిపుణులు. అబ్బాయిల విషయానికి వస్తే... ఎక్కువ మంది సెక్స్ చేయాలన్న ఫాంటసీ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే దీని కోసం ఆశ పడుతుంటారు.

Sex in fashion

మగవాడు దాన్నో విజయంగా భావిస్తాడు. కెరీర్‌లో తన ఎదుగుదలకు కానుకలా ఊహిస్తాడు. ఆ లైంగిక అనుభవంతో అతడి ఇగో బలపడుతుంది.

Sex in fashion

ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి పెళ్లైన స్త్రీలు కూడా ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ చూపిస్తుండటం గమనార్హం. పెళ్లై పిల్లలు ఉన్నా.. తమలో అందం తగ్గలేదని.. ఎంతటి మగాడినైనా ఆకర్షించగలమనే భావనతో ఇలాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Sex in fashion

అయితే.. ఒక్కసారి ఈ విషయం భాగస్వాములకు తెలిస్తే మాత్రం జీవితాలు నాశనం అవుతాయాని కాపురాలు కూలిపోతాయని చాలా మంది ఆలోచించకపోవడం విచారకరం. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడి కాపురాలు కూల్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

Sex in fashion

చాలా మంది ఈ వన్ నైట్ స్టాండ్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. ఒక్కసారి పొరపాటున వారితో ఎమోషనల్ గా ఎటాచ్ అయితే మాత్రం చాలా  ఇబ్బందిపడాల్సి ఉంటుంది.  ఈ వన్ నైట్ స్టాండ్స్ కావాలంటే.. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Sex in fashion

అంతేకాదు.. దీనిని లైఫ్ లో ఒక్కసారి ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పులేదు. అయితే.. ఇదే కనుక అలవాటుగా మారితే మాత్రం.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sex in fashion

ఇక.. తెలయని వారితో సెక్స్ అంటే.. వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు.. ముఖ్యంగా లైంగకంగా ఒకరి నుంచి మరొకరికి సోకే సమస్యలు ఉంటే.. అవి మీకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

Latest Videos

click me!