
ఒకరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా వారి మనసులో ప్రేమ ఉందా అని ఎలా తెలుసుకోవాలి? కొంతమంది నేరుగా ప్రేమను వ్యక్తం చేస్తూ ఐ లవ్ యు చెప్పకుండా, వాళ్ల పనుల ద్వారానే ఆ ఫీలింగ్‌ను బయటపెడతారు. మీరు చెప్పే చిన్న చిన్న విషయాలను గమనించడం నుంచి మీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఛాన్సులు వెతుక్కోవడం వరకు కొన్ని సంకేతాలు వాళ్ల ఇంట్రెస్ట్‌ను చూపిస్తాయి. అలాంటి ఐదు ముఖ్యమైన సంకేతాలు ఇప్పుడు చూద్దాం.
ఎవరికైనా మీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాట్లాడే విషయాలను చాలా శ్రద్ధగా వింటారు. ముఖ్యంగా ఇతరులు అంతగా పట్టించుకోని చిన్నచిన్న డీటెయిల్స్‌ను కూడా వాళ్లు గుర్తుంచుకుంటారు... ఉదాహరణకి మీకు ఏ ఫుడ్ ఇష్టం, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు, చిన్నప్పుడు జరిగిన మర్చిపోలేని సంఘటన ఏంటి, ఆఫీస్‌లో మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి వంటివి. మీరు ఇంతకుముందు చెప్పిన విషయాలను మళ్లీ వాళ్లే గుర్తుచేసి మాట్లాడొచ్చు. ఉదాహరణకు మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉందని చెప్పారనుకోండి, ఆ రోజు అవ్వగానే ఆ పని ఎలా జరిగిందని అడుగుతారు. ఇలాంటి పనులు వాళ్లు మీ మాటలను ఎంత శ్రద్ధగా వింటున్నారో చెబుతాయి.
2. తరచుగా మాట్లాడకపోయినా టచ్‌లో ఉండటానికి ట్రై చేస్తారు
ప్రేమలో ఉన్నవాళ్లు రోజంతా మెసేజ్‌లు పంపాలనే రూల్ ఏమీ లేదు. కానీ మీతో టచ్‌లో ఉండటానికి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపడం, మీరు ఎలా ఉన్నారని అడగడం, ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకోవడం, ఇంతకుముందు ఆగిపోయిన టాపిక్‌ను మళ్లీ కంటిన్యూ చేయడం లాంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు ఎలాంటి రీజన్ లేకపోయినా మీతో మాట్లాడటానికి ఛాన్సులు క్రియేట్ చేసుకుంటారు. అదే టైమ్‌లో మీ రిప్లై కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక్కడ మెసేజ్‌ల కౌంట్ కంటే వాళ్లు చూపిస్తున్న కేరింగ్ ముఖ్యం.
ఒకరి మీద నమ్మకం, చనువు పెరిగినప్పుడు వాళ్ల గురించిన విషయాలను పంచుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్‌లో నార్మల్ విషయాలు మాట్లాడినా, రాను రాను ఫ్యామిలీ, ఫ్రెండ్స్, చైల్డ్‌హుడ్ మెమరీస్, లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు, ఫ్యూచర్ డ్రీమ్స్ లాంటి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు. అలాగే మీ గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీ ఇష్టాలు, కలలు, లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడుగుతారు. ఈ సంభాషణలు కేవలం టైమ్‌పాస్ కోసం కాకుండా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి.
మీ మీద ప్రేమ ఉందని మిమ్మల్ని కంట్రోల్ చేయాలని వాళ్లు అనుకోరు. నిజమైన కేరింగ్ ఉంటే మీ ఇష్టాలను, మీ పర్సనల్ స్పేస్‌ను వాళ్లు కచ్చితంగా రెస్పెక్ట్ చేస్తారు. మీకు ఒకరోజు ఒంటరిగా ఉండాలనిపిస్తే దాన్ని అర్థం చేసుకుంటారు. వెంటనే కలవలేనని చెప్తే ఫోర్స్ చేయరు. మీకు ఇష్టంలేని పనులు చేయమని అస్సలు ఒత్తిడి చేయరు. అలాగే రిలేషన్‌షిప్‌కి వెంటనే ఒక పేరు పెట్టాలనో లేదా వాళ్ల ఫీలింగ్స్‌ను వెంటనే యాక్సెప్ట్ చేయాలనో కండిషన్స్ పెట్టరు. ఇద్దరికీ కంఫర్టబుల్‌గా ఉండేలా మెల్లగా రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. ఒకరి పర్సనల్ ఫ్రీడమ్‌ని గౌరవించడం హెల్తీ రిలేషన్‌షిప్‌కి చాలా ఇంపార్టెంట్.
5. ఫ్యూచర్ ప్లాన్స్‌లో మిమ్మల్ని కూడా చేర్చుకుంటారు
ఎవరికైనా మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీతో ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటారు. అది వాళ్ల చిన్న చిన్న ఫ్యూచర్ ప్లాన్స్‌లో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు వచ్చే వారం ఓపెన్ అయ్యే కొత్త రెస్టారెంట్‌కి ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పొచ్చు. మీకు ఇష్టమైన ప్లేస్‌కి ఒకరోజు తీసుకెళ్తానని అనొచ్చు. కొన్ని నెలల తర్వాత జరిగే ఈవెంట్‌కి కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు. ఇలాంటి మాటలు మీతో మళ్లీ మళ్లీ కలవాలని, టైమ్ గడపాలని వాళ్లు కోరుకుంటున్నారని చూపిస్తాయి. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే కాకుండా కంటిన్యూస్‌గా ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటే వాళ్ల ఇంట్రెస్ట్‌ని మీరు గమనించొచ్చు.
పైన చెప్పిన ఐదు సంకేతాలు ఎవరికైనా మీ మీద ప్రేమ ఉందనడానికి కచ్చితమైన ప్రూఫ్స్ కాదు. కొంతమంది నేచురల్‌గానే అందరితో కేరింగ్‌గా ఉంటారు. ఫ్రెండ్‌షిప్‌లో కూడా ఇలాంటివి కనిపిస్తాయి. అందుకే ఒక చిన్న విషయాన్ని బట్టి వెంటనే ఫిక్స్ అవ్వకుండా, వాళ్ల బిహేవియర్ కంటిన్యూస్‌గా ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మీ మీద చూపిస్తున్న కేరింగ్ మిగతా వాళ్ల దగ్గర చూపిస్తున్న దానికంటే డిఫరెంట్‌గా ఉందా లేదా అనేది అర్థం చేసుకోండి. ఒకరి నిజమైన ఫీలింగ్స్ తెలుసుకోవడానికి ఓపెన్‌గా మాట్లాడుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఊహల మీద మాత్రమే ఆధారపడి రిలేషన్‌షిప్ గురించి తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు.