నేషనల్ లైబ్రరీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ మహిళల్లో రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతేకాదు శరీరంలో మూత్రం పరిమాణం కూడా పెరుగుతుంది. కెఫిన్ మహిళల్లో చంచలతను పెంచుతుంది. నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుంది. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో కెఫిన్-సున్నితంగా మారుతారు. ఎందుకంటే అవి రక్తం నుంచి శుభ్రపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారి ఆరోగ్యానికి సంబంధించిన ఈ పరిస్థితి ప్రభావం పిల్లల ఆరోగ్యంపై కూడా పడుతుంది.