ఆన్లైన్ గేమింగ్ తో పిల్లల ఆరోగ్యానికి దెబ్బ.. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

First Published | Jan 14, 2024, 11:50 AM IST

పెద్దలే కాదు ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు. దీనికి కారణం తల్లిదండ్రులే. పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు పిల్లల చేతికి పేరెంట్సే మొబైల్ ఫోన్స్ ను ఇస్తుంటారు. కానీ ఇది మీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే? 
 

దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే.. ప్రతిదీ చెడు చేస్తుందని రుజువు అవుతుంది. అలాగే పిల్లల్లో పెరుగుతున్న ఆన్లైన్ గేమింగ్ అలవాటు కూడా శారీరక, మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితి ప్రతి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. స్మార్ట్ ఫోన్లపై పిల్లలకు ఉన్న ఈ ప్రేమ ఏ ఒక్క ఇంటి కథ కాదు. ఈ ఆటల క్రేజ్ ఎంతలా పెరిగిందంటే చదువుకునే వయసులోనో, నేర్చుకునే వయసులో పిల్లలు ఎక్కువ సమయం ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ గడుపుతారు. ఒక్కసారి పిల్లలు ఆన్లైన్ గేమింగ్  కు అలవాటు పడ్డారంటే.. వారిని ఈ వ్యసనం నుంచి బయటపడేయడం చాలా కష్టం. మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఈ వ్యసనం నుంచి బయటపడేయడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

మాట్లాడండి..

పిల్లవాడు ఆన్లైన్ లో గేమ్ ఆడుతున్నారంటే.. తల్లిదండ్రులు వారిని కొట్టడమో, తిట్టడమో చేస్తుంటారు. కానీ వీటి వల్ల పిల్లలు మరింత మొండిగా తయారవుతుంటారు. అలాగే మీకు తెలియకుండా చాటుగా ఆడుతారు. అలాగే మీపై కోపాన్ని కూడా పెంచుకుంటారు. అందుకే పిల్లలను తిట్టడానికి, కొట్టడానికి బదులుగా వారితో కూర్చుని మాట్లాడండి. అలాగే ఈ ఆటలను ఎలా ఆడతారు? దానిలో వీరికి ఏం నచ్చుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పిల్లలతో ఒక ఫ్రెండ్ లా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వారు మీకు అన్ని విషయాలను చెప్తారు. అలాగే మీరు చెప్పింది వినే అవకాశం ఉంది.


ఓ కంట కనిపెడుతూ ఉండండి

తల్లిదండ్రులు తమ పిల్లలు ఏయే టైం కు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలాసార్లు పిల్లలు రోజంతా తమ గదిలో ఉంటున్నా.. వాళ్లు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు మాత్రం తెలియదు. కానీ ఇది మంచిది కాదు. అందుకే మీ పిల్లలు ఏం చేస్తున్నారో కాస్త శ్రద్ధ పెట్టండి. అలాగే వారి వ్యసనం నుంచి ఒక్క రోజులో బయటపడలేమని అర్థం చేసుకోండి. కానీ మీరు కొంచెం ప్రయత్నించి వారితో కూర్చుని వారికి కొత్తది నేర్పితే గేమింగ్ ఈ వ్యసనం పూర్తిగా పోతుంది. 
 

హింసాత్మక ఆటలు ఆడొద్దు

ముఖ్యంగా హింసాత్మక ఆటలు ఆడకుండా మీ పిల్లలను దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇవి మీ పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వాటి ప్రభావం పిల్లలపై ఎంతలా పడుతుందంటే.. తుపాకీ లేదా కత్తిని ఉపయోగించాలన్న కోరికను పెట్టిస్తుంది. అలాగే వీటి వల్ల వారికి అవకాశం వస్తే ఏదైనా చెడుకు పాల్పడే అవకాశం ఉంది. వాటిని ఆడటం వల్ల పిల్లలకు విపరీతంగా కోపం వస్తుంది. ఇక్కడ పిల్లలు వర్చువల్, రియల్ లైఫ్ కు మధ్య వ్యత్యాసాన్ని మరచిపోతారు.

మీపై కూడా శ్రద్ధ వహించండి

ఓ వైపు పిల్లలు ఆన్లైన్ గేమ్స్, మొబైల్ కు దూరంగా ఉండాలని చెబుతుంటే.. మరోవైపు మీరు రోజంతా మొబైల్ కు అతుక్కుపోతుంటే మీ పిల్లలపై తప్పుడు ప్రభావం పడుతుంది. అలాగే వాళ్లు మీ మాటలను అర్థం చేసుకోరు. అందుకే మీ పిల్లలకంటే ముందుగా మీరే మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండండి. 

Latest Videos

click me!