ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లోనే చదువుతున్నారు, అది కామన్ అయిపోయింది. ఒకప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అంటూ రెండూ ఉండేవి. ఇప్పుడు అలా కాదు.. చదువు అంటే అది ఇంగ్లీష్ లోనే సాగుతోంది. చదువు మాత్రమే కాదు... స్కూల్ కాంపౌండ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి.. మళ్లీ బయటకు వచ్చే వరకు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఇదొక రూల్ గా మార్చేశారు. వీటి వల్లే అనుకుంటే.. రెండో, మూడో తరగతి అంత కంటే చిన్న పిల్లలు కూడా చాలా ఫ్లూయంట్ గా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. కానీ.. వారి సొంత మాతృ భాషలో మాత్రం మాట్లాడలేకపోతున్నారు.
Teaching up to Class 5 in mother tongue or regional language, lowering the stakes of board exams, a single regulator for higher education institutions, except for law and medical colleges, and common entrance tests for universities are part of the sweeping reforms in the new NEP.
అందుకు కారణం కూడా ఉంది. ఇంట్లో పేరెంట్స్ సైతం తమ పిల్లలకు ఇంగ్లీష్ బాగా రావాలని.. తెలుగులో మాట్లాడితే తక్కువ అయిపోతారనే భావనతో వారు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేస్తున్నారు. దీంతో... వారికి మాతృభాషలో కనీసం బేసిక్స్ కూడా తెలియడం లేదు. పేరెంట్స్ దృష్టిలో ఆలోచిస్తే వారి ఆలోచన లో నిజం ఉండొచ్చు. కానీ.. నిజానికి మనం ఇంట్లో ఏ భాషలో పిల్లలతో మాట్లాడితే వారి లైఫ్ బాగుంటుంది.. ? నిజానికి వారికి ఏది అవసరం అనే విషయం తెలుసుకుందాం..
మన పిల్లలకు ఇంగ్లీష్ రావాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ.. అది స్కూల్లో టీచర్స్ చూసుకుంటారు. కానీ.. మీరు ఇంట్లో మాత్రం కచ్చితంగా మాతృభాషలోనే మాట్లాడాలి. మాతృ భాషలో మాట్లాడినప్పుడే పిల్లలకు ఫ్యామిలీ బాండింగ్స్ విలువ తెలుస్తుంది.
ఇంట్లో మాతృభాష మాట్లాడటం అనేది మన సంస్కృతీ, సంప్రదాయాలను వారికి నేర్పించినవారు అవుతారు. అంతేకాదు పిల్లలకు తమ సంప్రదాయాలపై విలువ తెలుస్తుంది. మన రూట్స్ అర్థమౌతాయి. అంతేకాదు.. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా.. మాతృభాషలో పలకరించే పిలుపు, మాటలు ఇచ్చినంత కమ్మదనం మరే భాష ఇవ్వలేదు.
ఇక.. ఇంట్లో అందరికీ ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలకు ఆ భాష వచ్చి ఉండదు. దీంతో వారి మధ్య కమ్యూనికేషన్ డెవలప్ అవ్వదు. అదే పిల్లలకు మాతృభాష వచ్చి ఉంటే.. వారి మధ్య కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. బంధాల విలువ తెలుస్తుంది. ఎలాంటి మిస్ కమ్యూనికేషన్, అపార్థాలకు తావు ఉండదు.
మాతృభాషలో మాట్లాడే పిల్లల్లో జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుందట. వారు ఏ విషయం అయినా చాలా త్వరగా అర్థం చేసుకోగలరట. ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, వారిలో మెంటల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందట.
కేవలం పిల్లలకు ఇంగ్లీష్ ఒక్కటి వస్తే సరిపోతుంది అనుకోకూడదు. వారు ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరం. అందులో మాతృభాష కూడా ఉండాలి. ఇలా రెండు అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడగల పిల్లల్లో స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ముందు రెండు వచ్చిన వారికి.. ఇతర భాషలు నేర్చుకోగల కెపాసిటీ కూడా ఉంటుందట.
ఇంట్లో మాతృభాష మాట్లాడే పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందట. వారి పట్ల వారికి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందట. వారిపట్ల వారికి ఎక్కువ నమ్మకం కూడా పెరుగుతుందట. ఏ విషయంలనూ వారు తమను తక్కువ చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట.
అంతేకాదు.. మాతృభాషలో ఫ్లూయింట్ గా మాట్లాడే పిల్లలు స్టడీలోనూ టాప్ గా ఉంటారట. స్కూల్లో చెప్పే పాఠాలు బాగా అర్థం చేసుకొని మంచి మార్క్క్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందట.