పిల్లలు వాళ్ల నాన్నతో సమయం ఎందుకు గడపాలో తెలుసా?

First Published | May 25, 2024, 10:45 AM IST

నిజం చెప్పాలంటే తండ్రులే పిల్లలకు రోల్ మోడల్. తండ్రులను చూసే పిల్లలు జీవితంలో ఎలా ఎదగాలి? ఇతరులకు ఎలా ప్రవర్తించాలి? ఎలా మాట్లాడాలి వంటి ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. పిల్లలు తమ తండ్రులతో సమయాన్ని గడపడం వల్ల పిల్లలు ఎలా తయారువుతారో తెలుసా?
 

పిల్లల జీవితంలో తండ్రి చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే తండ్రిని చూసే పిల్లల ఎలా బతకాలో నేర్చుకుంటారు. తండ్రీ కొడుకుల మధ్య పరస్పర చర్య పిల్లలను మానసికంగా, సామాజికంగా, మేధోపరంగా అభివృద్ధి చేస్తుంది. అసలు తండ్రులను చూసి పిల్లలు ఏయే విషయాలను చేర్చుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ఆదర్శంగా..

ప్రతి తండ్రి తన పిల్లలకు ఆదర్శంగా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు వాళ్ల వాళ్ల తండ్రుల నుంచి క్రమశిక్షణ, డ్యూటీ, ఇతర జీవన నైపుణ్యాలను ఆదర్శంగా తీసుకుంటారు. పిల్లలకు వాళ్ల నాన్నలే రోల్ మోడల్. 0

Latest Videos


భావోద్వేగ సంబంధం

మీరు గమనించారో? లేదో? పిల్లలకు నాన్నలంటే ఎక్కడలేని ఇష్టం. వారితో బయటకు వెళ్లాలని, ఆడుకోవాలని, వారికి జోలి చెప్పాలని, నాన్నలతో కథలు చెప్పించుకోవాలని ఎంతో ఇష్టం ఉంటుంది. మీకు తెలుసా? పిల్లలు తండ్రితో సమయాన్ని గడపడం వల్ల తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగ బంధం బలపడుతుంది.

విద్యా అభివృద్ధి

పిల్లలకు స్కూల్ విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా చాలా అవసరం. ముఖ్యంగా తండ్రి ప్రమేయం పిల్లలకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో పిల్లలకు తండ్రి పిల్లలకు విద్య నేర్పడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తండ్రి ప్రమేయం విద్యా సాధనకు అనుకూలంగా ఉంటుంది. తండ్రులు చెప్పిన మాట పిల్లలు ఖచ్చితంగా వింటారు. ఇది వారి బంగారు భవిష్యత్తుకు సహాయపడుతుంది.
 

ఆత్మవిశ్వాసం

తండ్రీ కొడుకుల మధ్య నిర్మాణాత్మక కమ్యూనికేషన్ పిల్లలు అనుకున్న దాన్ని సాధించడానికి సహాయపడుతుంది. అలాగే తండ్రులు తన విజయాన్ని బిడ్డతో పంచుకోవడం వల్ల మీ పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

సామాజిక నైపుణ్యాలు

పిల్లలకు తమ తండ్రితో బయటకు వెళ్లాలనే ఇష్టం చాలా ఉంటుంది. అయితే ఇలా తండ్రితో పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వాళ్ల నాన్న ఇతరులతో మాట్లాడుతాడు. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే ఈ విషయాలన్నీ పిల్లలు సామాజిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడతాయి. పిల్లలు తమ తండ్రులు ఎలా మాట్లాడుతున్నారో బాగా గమనిస్తారు. 

parenting model

స్వీయ ఆలోచన

తండ్రులు తన పిల్లలకు బాధ్యతలను అప్పగించడం, స్వేచ్ఛను ఇవ్వడం వల్ల వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఇది వారి ఎదుగుదలకు సహాయపడుతుంది. 

click me!