పిల్లలను ఇలాంటి విషయాల్లో బలవంత పెడుతున్నారా..?

First Published | May 24, 2024, 10:17 AM IST

 పిల్లలను చాలా విషయాల్లో క్రమశిక్షణ పేరుతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. బలవంతంగా అయినా పిల్లలతో కొన్ని పనులు చేయిస్తారు. కానీ.. పొరపాటున కూడా పేరెంట్స్ పిల్లలను బలవంత పెట్టకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. 


పెళ్లైన దంపతులు అందరికీ  పేరెంట్స్ అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ.. పిల్లల పెంపకం అనేది అంత ఈజీ విషయం కాదు. చాలా సవాలుతో కూడుకున్న విషయం ఇది.చాలా మంది తమ పేరెంట్స్  తమ పిల్లలను ది బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం  పిల్లలను చాలా విషయాల్లో క్రమశిక్షణ పేరుతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. బలవంతంగా అయినా పిల్లలతో కొన్ని పనులు చేయిస్తారు. కానీ.. పొరపాటున కూడా పేరెంట్స్ పిల్లలను బలవంత పెట్టకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం....

1. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఏదో ఒక విషయంలో ఏడుస్తూనే ఉంటారు. వారికి నచ్చినది చెయ్యకపోయినా, అడిగింది ఇవ్వకపోయినా వెంటనే తమ ఆయుధం బయటపెడతారు. అదే ఏడుపు. వెంటనే ఏడుస్తారు. అయితే... పిల్లలు ఏడ్వడం మొదలుపెట్టగానే.. పేరెంట్స్ కి చిరాకు మొదలౌతుంది. వెంటనే.. వాళ్లను ఆ ఏడుపు ఆపమని బెదిరిస్తారు. కానీ ఆ తప్పు చేయకూడదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారని, వారి ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. వారికి బాధ కలిగితే ఏడ్వడం చాలా సహజం. వాళ్ల ఎమోషన్స్ ని మనం బలవంతంగా వాళ్ల ఏడుపును ఆపే ప్రయత్నం చేయకూడదు.
 


parents


2.పిల్లలు తప్పులు చేయడం సహజం. అయితే... పిల్లలు ఎవరినైనా హర్ట్ చేస్తే.. వెంటనే మనం వారికి క్షమాపణలు చెప్పమని పిల్లలను బలవంత పెడతాం. బలవంతంగా అయినా.. సారీ చెప్పిస్తూ ఉంటాం. కానీ.. బలవంతంగా ఇలా చెప్పించకూడదు. పిల్లలు మనస్ఫూర్తిగా సారీ చెప్పేలా చేయాలి. వారు చేసింది ఎంత తప్పో.. వారికి అర్థమయ్యేలా చేయాలి. అంతేకానీ.. మొక్కుబడిగా సారీ చెప్పించడం కరెక్ట్ కాదు. తక్షణం క్షమాపణలు కోరడానికి బదులుగా, పరిస్థితిని గురించి వారికి మార్గనిర్దేశం చేయండి. వారి చర్యలు ఎందుకు బాధాకరంగా ఉన్నాయో వివరించండి. ఈ విధానం పిల్లలకు తాదాత్మ్యం , బాధ్యత గురించి లోతైన అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుంది.

parents

3.తోబుట్టువులు లేదా తోటివారి మధ్య పోలికలు చాలా హానికరం.  తోబుట్టువుల పోలికలు శత్రుత్వానికి, ఆత్మగౌరవాన్ని తగ్గించడానికి ,తోబుట్టువుల సంబంధాలను దెబ్బతీస్తాయని కనుగొంది. ప్రతి బిడ్డ వారి స్వంత బలాలు , బలహీనతలతో ప్రత్యేకంగా ఉంటుంది. వారి వ్యక్తిగత ప్రతిభను ప్రోత్సహించడం, వారి వ్యక్తిగత వృద్ధికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. ఒకరితో పిల్లలను పోల్చడం వల్ల..  పిల్లలు మానసికంగా మరింత దెబ్బతింటారు.

4.కొందరు పేరెంట్స్ పిల్లలు తమకు నచ్చిన పని చేసినప్పుడు.. వారితో మాట్లాడము అని తేల్చి చెప్పేస్తారు. కొంత సేపటి  తర్వాత మీరు వారితో మాట్లిడినా.. ఆ కాసేపు మాట్లాడని సమయం  వారి మనసులను కుంగదీస్తుంది.  ఎమోషనల్ గా పిల్లలను బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ పద్దతి కాదు. పిల్లలు తమ తల్లిదండ్రులతో తమ సంబంధాన్ని సురక్షితంగా భావించాలి. బెదిరింపులకు బదులుగా, నిర్మాణాత్మక క్రమశిక్షణపై దృష్టి పెట్టండి.
 

పిల్లలు ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు.. వారిని నిరుత్సాహరచకూడదు. అది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని  ఇబ్బంది పెట్టకూడదు. వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి. పిల్లలలో ఎదుగుదల మనస్తత్వాన్ని పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. వారి సామర్థ్యాలను అణగదొక్కే బదులు, ప్రయత్నం , పట్టుదలని ప్రోత్సహించండి. ‘ఇది చాలా కష్టంగా ఉంటుంది.. కానీ నువ్వు ప్రయత్నిస్తున్నావా,వెరీ గుడ్ ’అని చెప్పాలి.
 


పిల్లలతో పేరెంట్స్  అస్సలు చెప్పకూడని మరో ముఖ్యమైన విషయం నువ్వు అందంగా లేవు.. నువ్వు బాగోలేవు లాంటి మాటలు చెప్పకూడదు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల...  పిల్లల్లో  ఆత్మగౌరవం దెబ్బతింటుంది. పేరెంట్స్  కూడా పిల్లలను అలా అంటే... పిల్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతిని, మానసికంగా  లోలోపల కుమిలిపోతారు. కాబట్టి.. ఆ పొరపాటు చేయకూడదు.

Latest Videos

click me!