Latest Videos

పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలి?

First Published May 24, 2024, 3:59 PM IST

కొంతమంది పిల్లలు ఉండాల్సిన వయసు కంటే హైట్ బాగా పెరిగిపోతారు. కానీ మరికొంతమంది పిల్లలు మాత్రం వయసుకు తగ్గ హైట్ కూడా ఉండరు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. 

kids

మారుతున్న జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది పిల్లలు హైట్ పెరగడం లేదు. కానీ పిల్లలు హైట్ పెరగకపోయే సరికి తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడిపోతుంటారు. పిల్లలు పెరగకుండా అలాగే ఉంటారేమోనని భయపడిపోతుంటారు. అయితే తల్లిదండ్రులు కొన్ని పనులు చేస్తే పిల్లలు హైట్ బాగా పెరుగుతారు. పిల్లలు ఎత్తు పెరగడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వేలాడే వ్యాయామాలు

సహజంగా పిల్లల ఎత్తును పెంచడానికి కొన్ని రకాల వ్యాయామాలు బాగా ఉపయోగపడతారు. నిపుణుల ప్రకారం.. పిల్లలు వేలాడే వ్యాయామాలు చేస్తే ఎత్తు బాగా పెరుగుతారు. ఈ వ్యాయామాలు శరీరానికి ఆకృతిని ఇస్తాయి. అలాగే పిల్లలు బాగా ఎత్తు పెరగడానికి కూడా సహాయపడతాయి. 
 

foods for kids

ఈ పండ్లను తినిపించండి

పండ్లు అందరి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పండ్లను తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. రోగాలకు దూరంగా ఉంటారు. కొన్ని రకాల పండ్లు పిల్లలు ఎత్తు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరటి పండు, దానిమ్మ పండు, ఆపిల్, మామిడి వంటి పండ్లను మీ పిల్లల ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే గుణాలు పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడతాయి. 

పాలు

పాలు పిల్లల్ని బలంగా చేయడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. పాలలో కాల్షియం, విటమిన్-డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడతాయి. అందుకే మీ పిల్లలు రోజూ ఒక గ్లాస్ పాలు తాగేలా చూడండి. 

తాడు ఆట

ఆడుకోవడం వల్ల కూడా పిల్లల ఎత్తు పెరుగుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే బాగా ఆడుకోమని చెప్పండి. అలాగే తాడు ఆట ఆడమని చెప్పండి. ఇది పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

Kids food

గుడ్లు తినిపించండి

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఉండే పోషకాలు శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే మాత్రం వారికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును పెట్టండి. 
 

మంచి నిద్ర

సరిగ్గా నిద్రపోకపోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎత్తు పెరగరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే వారు సరైన సమయంలో నిద్రపోయేలా చేయాలి. కంటినిండా నిద్ర ఉంటేనే మీ పిల్లలు హైట్ పెరగడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. 

శారీరక కార్యకలాపాలు

శారీరక కార్యకలాపాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా వారు హైట్ పెరగడానికి కూడా సహాయపడతాయి. అందుకే మీ పిల్లల్ని రోజుకు ఒకసారి అవుట్ డోర్ ఆటలు ఆడేలా చూడండి. దీనివల్ల వారి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటారు. ఎత్తు కూడా పెరుగుతారు. 
 

click me!