పేరెంట్స్ కి దూరంగా పడుకోవడం పిల్లలకు ఎలా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఒక్కసారిగా పిల్లలను నీకు ఎనిమిదేళ్లు వచ్చేసాయి.. నువ్వు వేరే గదిలో పడుకోవాలి అని చెబితే పిల్లలు భయపడతారు. ఒంటరిగా పడుకోవడానికి వారిలో భయం, ఇన్ సెక్యురిటీ ఫీలింగ్స్ లాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి.. వారికి ప్రేమగా చెప్పాలి. వారి భయం పోగొట్టేలా.. వారిని వేరే గదిలో పడుకునేలా ప్రోత్సహించాలి. అలా వారి గదిలో వారు పడుకునేలా... వారికంటూ స్పెషల్ బెడ్, థింక్స్ ఏర్పాటు చేయాలి. అప్పుడు వారు కూడా అలా పడుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.