కరోనాకు ముందు పిల్లలు ఇంటి చుట్టుపక్కల పిల్లలు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఆడుకునేవారు. ఆటలో పడి తినడం కూడా మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక మూలన కూర్చొని ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పిల్లల్లో మారుతున్న ఈ అలవాటు వల్ల వారు సోమరులుగా మారిపోతున్నారు. అంతేకాదు ఫోన్ల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. వారికి ఆనందం అనేది లేకుండా పోతోంది. చాలా మంది పిల్లలను టీవీ కాకుంటే ఫోన్, ఫోన్ కాకుంటే టీవీని చూస్తుంటారు. వీటివల్ల కూర్చున్న దగ్గర నుంచి పక్కకు కూడా జరగాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ అలవాటు వల్ల పిల్లల ఆరోగ్యం ఏమౌతుందో ఒక్క సారి ఆలోచించారా?