మొదటిసారి స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో తెలుసా?

First Published | Jun 5, 2024, 2:48 PM IST

మొదటిసారి స్కూలుకు వెళ్లే పిల్లలకు స్కూళ్లో ఎలా ఉండాలో అస్సలు తెలియదు. ఇంటి వాతావరణానికి, స్కూలు వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ సారే స్కూలుకు పంపే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని విషయాలు చెప్పాలి. 

వచ్చే వారం నుంచే పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటాయి. ఇప్పటి నుంచే స్కూలుకు వెళ్లే పిల్లల కోసం బ్యాగులు, బాక్సులు, నోట్ బుక్స్ ను కొంటుంటారు తల్లిదండ్రులు. అయితే మొదటి సారి వెళ్లే పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. వారి అవసరాలను తెలుసుకోవడమే కాకుండా.. స్కూలుకు వెళ్లిన తర్వాత ఎలా ఉండాలి? టీచర్లతో ఎలా మెలగాలి? తోటి పిల్లలతో ఎలా ఉండాలో నేర్పించాలి. అసలు మొదటి సారి స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు ఏయే విషయాలను చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పాఠశాల గురించి మాట్లాడుతూ..

మొదటి సారి స్కూలుకు పంపే పిల్లలకు తల్లిదండ్రులు చాలా విషయాలను చెప్పాలి. వీటిలో ఫస్ట్ స్కూలు గురించి మాట్లాడాలి. అంటే స్కూల్ ఎలా ఉంటుంది? అక్కడ ఏం చేయాలి? పాఠశాల ఎప్పుడు ముగుస్తుంది వంటి విషయాలను పిల్లలతో చెప్పాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలనే విషయాల గురించి కూడా పిల్లలలో ఖచ్చితంగా మాట్లాడండి. 
 


తినడం గురించి చెప్పండి

పిల్లలు ఇంట్లో ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటుంటారు. కానీ స్కూల్లో అలా ఉండదు. అందుకే పాఠశాలలో పద్దతిగా తినాలంటే మీరు వారికి ముందే నేర్పించండి. స్కూల్లో సరిగ్గా ఎలా తినాలో? తిన్న తర్వాత చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పండి. అలాగే వారి లంచ్ బాక్స్ ను బ్యాగ్ లో పెట్టండి. 
 

స్నేహితులతో కలవడం

మొదటిసారి స్కూలుకు వెళ్లే పిల్లలకు స్కూల్లో ఒంటరిగా అనిపిస్తుంది. దీనివల్ల వారు స్కూలుకు వెళ్లడానికి  ఇంట్రెస్ట్ చూపరు. అందుకే పిల్లల్ని పాఠశాలలో ఇతర విద్యార్థులతో  మాట్లాడమని చెప్పాలి. అలాగే వారితో ఎలా మాట్లాడాలి? వారితో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోవాలి? వంటి సామాజిక అలవాట్లను నేర్పాలి. 
 

టాయిలెట్

టాయిలెట్ వచ్చినప్పుడు ఉపాధ్యాయుడి అనుమతి ఎలా తీసుకోవాలో కూడా పిల్లలకు నేర్పండి. టాయిలెట్ కు వెళ్లిన తర్వాత చేతులను, కాళ్లను ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. 
 

సమస్యల గురించి మాట్లాడటం

పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఏదైనా సమస్య ఉంటే ఆ విషయాన్ని టీచర్ కు లేదా తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పాలని పిల్లలకు తెలియజేయాలి. ఇది చాలా అవసరమని పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలి. 

గురువుకు విధేయత

మొదటిసారి బడికి వెళ్లే పిల్లవాడు చదువులో బాగా రాణించాలంటే గురువు మాట ఖచ్చితంగా వినాలి. అందుకే టీచర్ చెప్పే ప్రతి విషయాన్ని వినాలని , అందుకు అనుగుణంగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. 

Latest Videos

click me!