పిల్లలు నిద్రపోయేటప్పుడు ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 5, 2024, 12:20 PM IST

ఈ రోజుల్లో టీవీలు, ఫోన్లు పుణ్యమా అని పిల్లలందరూ వీటిలోనే మునిగితేలుతున్నారు. కానీ ఇవి పిల్లల శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే పిల్లలను ఎక్కువ సేపు ఫోన్లు చూడకుండా ఉంచాలి. 

Image: Getty


పిల్లల ఎదుగుదలకు, వారి ఆరోగ్యానికి నిద్ర చాలా చాలా ముఖ్యం. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. నిద్రలో పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతారు. మంచి నిద్ర వారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రవల్ల పిల్లల విద్యతో పాటుగా సామాజిక,  ఆధ్యాత్మిక ప్రక్రియలు కూడా మెరుగుపడతాయి.  అందుకే పిల్లల మెరుగైన అభివృద్ధికి వారి నిద్ర దినచర్యను సెట్ చేయడం చాలా ముఖ్యం. అందుకే పిల్లలు నిద్రపోయేటప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


సమయాన్ని సెట్ చేయండి

ముందుగా మీ పిల్లలు కంటినిండా నిద్రపోవాలి. సమయానికే మేల్కొవాలి. ఈ టైంను సెట్ చేయండి. ప్రతిరోజూ ఒకే టైంటో నిద్రపోవడానికి ప్రయత్నించండి. దీంతో ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోతాడు. నిద్రలేస్తాడు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. అయితే పిల్లల వయసును బట్టి నిద్ర వారికి ఎంత నిద్రఅవసరమో తెలుసుకోవాలి. 
 


వయస్సు: రోజుకు నిద్ర వ్యవధి

నవజాత శిశువులు రోజుకు 18-20 గంటలు
3-6 నెలల పిల్లలు రోజుకు 16-18 గంటలు
6-12 నెలలు పిల్లలు రోజుకు 12- 16 గంటలు
1-2 సంవత్సరాల పిల్లలు రోజుకు 12-14 గంటలు
3-4 సంవత్సరాల పిల్లలు రోజుకు  8-14 గంటలు

పిల్లలు నిద్రపోవడానికి ముందు ఏం చేయాలంటే?

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు స్నానం చేయించండి. 
అలాగే సౌకర్యవంతమైన నైట్ దుస్తులను వేయండి. 
పిల్లలను క్రిబ్ లేదా స్వింగ్ లో కాకుండా సౌకర్యవంతమైన మృదువైన మంచంపై పడుకోబెట్టండి.
పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఒక కథ లేదా జోలపాట పాడండి.


గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉండేలా చేయడానికి లైట్లను తక్కువగా, శబ్దం లేకుండా ఉంచండి.
పిల్లలను ముద్దు పెట్టుకోవడం లేదా కౌగిలించుకుని వారికి గుడ్ నైట్ చెప్పండి. ఇది వారిలో సాన్నిహిత్యం, నిశ్చయత భావాన్ని పెంచుతుంది. ఇది వారిని బాగా నిద్రపోయేలా చేస్తుంది. 
అలాగే పిల్లలకు రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి.ఒకటి రాత్రిపూట, రెండు ఉదయం పూట.
 

Latest Videos

click me!