పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 15, 2024, 4:14 PM IST

పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. అయితే పిల్లలకు మంచి భవిష్యత్తులు ఇవ్వాలనే తపనతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషంగా ఉంచడమే మర్చిపోతుంటారు. అసలు పిల్లలు హ్యాపీగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?
 

కొంతమంది కపుల్స్ పేరెంట్స్ గా మారిన తర్వాత అన్ని బాధ్యతలు తమ నెత్తి మీదనే పడ్డాయని అనుకుని నార్మల్ గా ఉండలేకపోతుంటారు. దీనివల్ల పిల్లల్ని చిన్న పిల్లలుగా చూడకుండా, ఏం చేసినా కొడుతుంటారు. తిడుతుంటారు, సాధారణంగా పిల్లలకు పరిగెత్తడం, ఆడుకోవడమంటే చాలా ఇష్టం. కానీ కొంతమంది తల్లిదండ్రులకు ఇది నచ్చదు.
 

పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనిస్తేనే వారు తమ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడికి వెళ్లకూడదు. అలా ఆడుకోకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఇది మీ మనశ్శాంతిని మాత్రమే కాకుండా మీ పిల్లల సంతోషాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ పిల్లల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనుకుంటే మాత్రం ఈ పనులు చేయండి. 
 


ఆప్యాయత

పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి మీరు వారికి ఖరీదైన వస్తువులను ఇప్పించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా? పెద్దల కంటే పిల్లలే ఇంట్లోని వాతావరణానికి ఎక్కువ సున్నితంగా ఉంటారు. అలాగే ప్రతి పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఆశించేదేంటో తెలుసా? తల్లిదండ్రులు తమ పట్ల మరింత ఆప్యాయంగా ఉండాలని. అలాగే చిన్న చిన్న పనులు చేసినా వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. పిల్లల కౌగిలింతకు, ముద్దుకు ఏదీ సాటిరాదు. ఈ యాక్టివిటీలు పిల్లల్ని ఆనందంగా ఉంచుతాయి. 

వారు చెప్పేది వినడం

పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటారు. అయితే చాలా మంది పేరెంట్స్ పిల్లలు చెప్పేది అస్సలు వినరు. పైగా ఆపండి అని అరుస్తుంటారు.  ఇది మీ పిల్లల్ని బాధపెడుతుంది. మీ పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు వారు చెప్పేది వినడం నేర్చుకోండి. అలాగే వారు చెప్పేదానికి స్పందించండి. 

సమయాన్ని గడపండి

అమ్మానాన్నలిద్దరూ పనిచేసేవారైతే పిల్లలు ఒంటరిగా మారిపోతారు. అవును డబ్బు సంపాదనలో పడి చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో కాసేపు కూడా గడపరు. మీ పిల్లలు అమ్మమ్మ, తాతయ్యలతో ఎంత ఆప్యాయంగా పెరిగినా  ,తల్లిదండ్రులతో సమయాన్ని గడపకపోతే వారు ఒంటరిగా ఫీలవుతారు. నిరాశ చెందరు. నిజానికి ఇది పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సమీప ప్రాంతాలకు మీ పిల్లల్ని తీసుకెళ్లండి.

రోల్ మోడల్ గా ఉండండి

కొంతమంది తల్లిదండ్రులు తప్పులు చేయడం సహజం. కానీ వాటిని పిల్లల ముందు చూపించకూడదు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. కానీ మీరు చేసే తప్పులు పిల్లలకు తెలియకుండా చూసుకోవాలి. మీరు మీ పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి. అప్పుడే మీ పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. 

Latest Videos

click me!