ఈ కాలంలో దాదాపు తల్లిదండ్రులు ఇద్దరూ పని చేస్తున్నారు. దీంతో... పిల్లల పెంపకం వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లులకు ఇంటి పనులకు, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేక చాలా ఇబ్బందులు పుడుతూ ఉంటారు. అలా అని.. పిల్లల పెంపకం విషయంలో.. తప్పులు వేయకుండా చూసుకోవాలి. ఇలాంటివారు.. ఇంటిని, పిల్లలను మ్యానేజ్ చేయడం నీతా అంబానీ నుంచి నేర్చుకోవాల్సిందే.
ఎందుకంటే... నీతా అంబానీకి ముగ్గురు పిల్లలు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ. అయితే... వారు ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ఆమె చాలానే కష్టపడ్డారని చెప్పొచ్చు. అంబానీ కుటుంబానికి ఎంత ధనం ఉన్నా.... పిల్లలకు ఆమె డబ్బు విలువను తెలియజెప్పేవారట. డబ్బు ఉందనే గర్వం ఎప్పుడూ వారి వద్దకు దరి చేరకుండా చేస్తారట. తాను ఎంత బిజీగా ఉన్నా.. తన పిల్లలతో మాత్రం ఆమె సమయం గడిపేవారట.