తల్లిదండ్రులు ఏది చెబితే అది ఇవ్వడం వల్ల నేటి పిల్లలకు కష్టాలు తెలియవు. డబ్బు ధర తెలియదు. తల్లితండ్రుల దగ్గర కూడా అంతే డబ్బు ఉన్నా పిల్లల ముందు ప్రదర్శించాల్సిన పనిలేదు. పిల్లలకు ఏది కష్టమో తెలియాలి. అలా అని పిల్లలను కష్టపెట్టమని కాదు.. వారి అవసరాన్ని గుర్తించకుండా.. అడిగినవన్నీ అందించకూడదు.
ఒక్క పెన్నులో ఇంక్ అయిపోతే ఇంక్ ఇచ్చే బదులు, మొత్తం పెన్ను స్థానంలో ఐదారు పెన్నులు పిల్లలకు ఇవ్వడం వృధా. పిల్లలకు అవసరమైతే ఒక పెన్ను లేదా పెన్సిల్ మాత్రమే ఇవ్వండి. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది. పిల్లలకు డబ్బు ప్రాముఖ్యతను చెబితే, వారే ఈ అనవసరమైన విషయాలకు నో చెప్పడం ప్రారంభిస్తారు. మార్పు తల్లిదండ్రుల నుంచి రావాలి.