పిల్లలు పిరికి వాళ్లు ఎందుకు అవుతారో తెలుసా?

First Published | Jun 7, 2024, 11:10 AM IST

పిల్లలు చాలా మృదువుగా ఉంటారు. బాల్యంలో జరిగిన చిన్న చిన్న విషయాలు కూడా వారి మదిలో నాటుకుపోతాయి. ఇవి వారి మనస్సుపై చాలా ప్రభావాన్నిచూపుతాయి. అలాగే కొన్ని విషయాలు పిల్లల్ని పిరికివాళ్లలాగ మారుస్తాయి. పిల్లల్ని పిరికివాళ్లను చేసే విషయాలేంటో తెలుసా? 
 

parenting

పిల్లలు సాధారణంగా ప్రతి కొత్త విషయానికి భయపడిపోతుంటారు. ఇది చాలా సహజం. కానీ పిల్లలు మరింత పిరికివారుగా మారితే వారి లైఫే మారుతుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కొత్త వ్యక్తులకు, కొత్త అనుభవాలకు, కొత్త వాతావరణాల నుంచి పారిపోవడం మొదలుపెడితే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందాల్సిందే. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త శ్రద్ధ తీసుకుంటే పిల్లలు ధైర్యంగా తయారవుతారు. కానీ వారిని అలాగే వదిలేస్తే మాత్రం పిరికివాళ్లలా మారుతారు. ఒక్కసారి పిల్లలు పిరికివారిగా మారారంటే ఇక జీవితాంతం పిల్లలు పిరికివాళ్లలాగే మిగిపోతారు. అసలు పిల్లలు పిరికివాళ్లలాగ మారడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆందోళనకు గురైన తల్లిదండ్రులను చూస్తే..

తల్లిదండ్రులే ఆందోళనకు గురైనప్పుడు వారి పిల్లలు సంతోషంగా, ధైర్యంగా ఉండలేరు. నిజానికి ఇలాంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ధైర్యవంతులుగా ఉంచలేరు. అలాంటి ప్రయత్నం కూడా చేయరు. అందుకే పిల్లలు పరికివాళ్లుగా మారకూడదంటే ముందుగా తల్లిదండ్రులు స్వీయ సంరక్షణ లేదా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటానికి కాస్త సమయం తీసుకోవాలి. ఆందోళనతో కూడిన వాతావరణంలో పెరిగిన పిల్లల్లో కూడా ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లలు బలహీనంగా, పిరికివారుగా అవుతారు.


తల్లిదండ్రులతో సంబంధాలు తెగిపోయినప్పుడు..

తల్లిదండ్రులు తమ పిల్లలతో సరిగ్గా కనెక్ట్ కానప్పుడు, తల్లిదండ్రులు పిల్లలలో సరిగ్గా మాట్లాడనప్పుడు పిల్లలు వారికి సంబంధించిన విషయాలను తల్లిదండ్రులకు  కాకుండా మరొకరితో పంచుకోవడం ప్రారంభిస్తారు. దీనిని బయటి వ్యక్తులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి  పిల్లలు కూడా పిరికివారు అవుతారు. ఇలాంటి పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా భయపడతారు.
 

చెడు అనుభవం..

చిన్నవయసులో ఏదైనా చెడు అనుభవం అయిన వారు జీవితాంతం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఆ విషయాన్ని తలుచుకుని ఎంతో భయపడిపోతుంటారు. పిల్లల జీవితంలో ఏదైనా చెడు ఘటనను ఎదుర్కొంటే అది జీవితంతం గుర్తుండిపోతుంది. అంటే ఇష్టమైన వాళ్లను కోల్పోవడం వంటివి. కానీ ఇది వారి మనస్సులో ఒక భయాన్ని కలిగిస్తుంది. పిల్లలు పిరికివాళ్లు కావడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. 

 
తల్లిదండ్రుల ప్రవర్తన..

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారు. పిల్లలకు రిస్క్ కాకుండా చూస్తున్నారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. దీనివల్ల పిల్లలు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. ఏదైనా కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి లేదా ఏదైనా కొత్త ప్రదేశాన్ని లేదా కొత్త వ్యక్తులను కలవడానికి భయపడుతుంటారు. దీనివల్లే చాలా మంది పిల్లలు పిరికిగా మారుతున్నారు. పిల్లలు అన్ని సవాళ్లను ఎదుర్కున్నప్పుడే వారు ధైర్యంగా ఉంటారు. 

Latest Videos

click me!