నిద్ర సమయం
గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి అవసరం. గర్భిణీ స్త్రీని గర్భధారణ సమయంలో నిద్రించడానికి అనుమతించాలి. ఈ అభ్యాసం తల్లి , బిడ్డ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా, భర్తలు తమ భార్యలు గర్భవతిగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. అనవసరంగా కాలక్షేపం చేసి నిద్ర సమయాన్ని పాడు చేసుకోకండి. ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
పాదాలకు మసాజ్..
గర్భిణీ స్త్రీల పాదాలకు భర్త మసాజ్ తరచుగా చేయాలి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. రోజుకు కనీసం రెండుసార్లు కాళ్ళు , పాదాలకు మసాజ్ చేయండి. భర్త... భార్య పాదాలను తాకడం ఏంటి అని చులకన ఫీలింగ్ లో ఉండకూడదు.