వీటితోపాటు.. స్కూల్లో పిల్లలు.. ఇతర పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు..? స్నేహంగా ఉంటున్నారా..? గొడవలు పడుతన్నారా లాంటి విషయాలను కూడా అడిగి తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. పిల్లల్లోనూ ఇవి ఉండటం చాలా కామన్. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఎవరికైనా కష్టమే. మరి.. పిల్లలు ఈ విషయంలో బ్యాలెన్సింగ్ గా ఉండటం పిల్లలకు ఎలా నేర్పుతున్నారు అనే విషయం అడగాలి. దాని కోసం టీచర్స్ ఎలాంటి సహాయం చేస్తున్నారు అనే విషయం అడిగి తెలుసుకోవాలి.