3.కొందరు పిల్లలు ఎప్పుడు చూసినా ఇంట్లో గంతులు పెడుతూనే ఉంటారు. వాళ్లకు అసలు అలసట అనేదే రాదు. అలాంటి వాళ్లతో పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.... అలాంటి పిల్లలను పేరెంట్స్ కనీసం.. రోజుకి రెండు గంటలు బయటకు తీసుకువెళ్లాలి. వాళ్లు రోజూ బయట రెండు గంటలు ఆడిస్తే.. వారు సెట్ అవుతారు. డ్యాన్స్ చేయించడం లేదంటే.. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తే సరిపోతుంది
4.ఇక కొందరు పిల్లలు.. పేరెంట్స్ ఏం చేసినా మొండిగా ఉంటారు. చెయ్యమంటే చెయ్యము అని మంకు పట్టుపడతారు. మీ పిల్లలు కూడా అలా చేస్తున్నారు అంటే... మీరు వారికి ఎక్కువ సార్లు వారు అడిగిన దానికి నో చెప్పి ఉంటారు. పిల్లలు అడిగిన దానికి నో చెప్పుకుంటే పోతే... వాళ్లు... ఇలానే మొండిగా తయారౌతారని తెలుసుకోవాలి.
పిల్లలు చేసే ప్రతి పనిని నేరంలా చూడకుండా.. వారు అలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే... మీ పిల్లల ప్రవర్తన కూడా మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
.