పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?

First Published May 21, 2024, 4:50 PM IST

పిల్లలు మంచిగా ఉంటున్నారా? చెడుగా ప్రవర్తిస్తున్నారా? అనేది తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందనేది నిజం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన బాగుండాలని కోరుకుంటారు. కానీ అలా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పాలంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచే ప్రతి ఒక్క మంచి, చెడు అలవాట్లను నేర్చుకుంటారనేది నిజం. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లల రోల్ మోడల్స్. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెడతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు తమను తాము ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనే దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. 

అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలతో సానుకూలంగా ఉండాలి. అలాగే వారికి మంచి చెడుల గురించి చెప్పాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థమయ్యేలా వివరించి మంచి మనుషులుగా ఎదిగేలా ప్రేరేపించాలి. పిల్లల్లో మంచి అలవాట్లను అవలంబించడానికి తల్లిదండ్రులు కూడా మంచి ఉదాహరణలు ఇవ్వాలి. ఏదేమైనా తల్లిదండ్రుల ప్రవర్తణను చూసే పిల్లలు నేర్చుకుంటారు. అందుకే పిల్లలకు మంచి అలవాట్లను నేర్పడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


స్వీయ నియంత్రణ 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి భావోద్వేగాలను నియంత్రించడం నేర్పాలి. అయితే పిల్లలు తల్లిదండ్రులను చూసే తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడం, వాటిని సరైన మార్గంలో ప్రదర్శించడం నేర్చుకుంటారు.
 

దయగల హృదయం

తల్లిదండ్రులు తమ పిల్లలతో చక్కగా ప్రవర్తించడమే కాకుండా ఇతరుల పట్ల దయ, సానుభూతిని చూపించాలి. ఎందుకంటే మీ పిల్లవాడు మిమ్మల్ని చూసే ఇతరుల పట్ల ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. మీరు దయగా ఉంటే పిల్లవాడు ఇతరల పట్ల దయగా ఉండాలని అనుకుంటాడు. 
 


భాగస్వామ్య అలవాటు

మీ పిల్లలు తన ఫుడ్ ను తన స్నేహితులతో పంచుకోవాలని ప్రతి తల్లిదండ్రులు చెప్పాలి. అలాగే తన ఫ్రెండ్స్ తో ఆడుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇది వారి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఈ విషయాలను ఖచ్చితంగా నేర్పాలి. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే ప్రవర్తించాలి. 
 

ఇతరులు చెప్పేది వినండి

పిల్లవాడు ఇతరుల విషయాలను వినాలన్నా, వారి చెప్పేది అర్థం చేసుకోవాలన్నా తల్లిదండ్రులుగా మీరు ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినండి. అలాగే ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరినొకరు ఖచ్చితంగా వినాలి. ఇది మీ పిల్లవానికి మంచి అలవాటును నేర్పుతుంది. 
 

కృతజ్ఞతను వ్యక్తపరచడానికి

తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేసినప్పుడు లేదా వారికి ఏదైనా నేర్పినప్పుడు పిల్లలు ప్రతిగా కృతజ్ఞతను చెప్పేలా ప్రేరేపించాలి. మీ పిల్లలు ఇలా చేయాలంటే మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతను చెప్పాలి. 


మంచి ప్రవర్తన

తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. మీ నుంచి నేర్చుకున్న విషయాలను పిల్లలు రి చుట్టూ ఉన్న వ్యక్తులు, పిల్లలతో అలాగే ప్రవర్తిస్తారు. అందుకే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, మర్యాదగా ఎలా ఉండాలో వారికి నేర్పండి. 
 


నిజాయితి

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీ గురించి ఖచ్చితంగా చెప్పాలి.  సత్యం, నిజాయితీ ఎంత ముఖ్యమో నేర్పితే మీ పిల్లలు ఎలాంటి చెడు పనులు చేయరు. అలాగే అబద్దాలు ఆడరు. అందుకే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలతో నిజాయితీగా ఉండండి. 

click me!