మగ పిల్లలు ఉన్న తండ్రులు ఈ తప్పులు చేయకూడదు తెలుసా?

Published : May 20, 2024, 04:28 PM IST

చాణక్య నీతి ప్రకారం... మగ పిల్లల తండ్రులు అస్సలు చేయకూడని పొరపాట్లు కూడా ఉన్నాయి. మరి ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం...  

PREV
15
మగ పిల్లలు ఉన్న తండ్రులు ఈ తప్పులు చేయకూడదు తెలుసా?
Father of male child should not do these mistakes


తండ్రిగా మారడమే ఒక బాధ్యత. అప్పటి వరకు ఎలా ఉన్నా.. తండ్రిగా మారినప్పుడు మాత్రం మరింత బాధ్యతగా మెలగాల్సిందే. అయితే... మగ పిల్లలకు తండ్రిగా మారినప్పుడు మాత్రం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది.
 

25

చాణక్య నీతి ప్రకారం... మగ పిల్లల తండ్రులు అస్సలు చేయకూడని పొరపాట్లు కూడా ఉన్నాయి. మరి ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం...
 

35


కొడుకులను ఎవరి ముందు పొగడకూడదని ఆచార్య చాణక్యుడు అంటాడు. మిమ్మల్ని మీరు పొగడటం ఎంత సరైంది కాదో, అలాగే మీ తెలివైన కొడుకును పొగడటం కూడా సరైంది కాదు, అలా చేయకుండా ఉండమని చాణక్యుడు సలహా ఇస్తాడు. సమాజంలో ఎంత మంచిగా ఉండాలో కచ్చితంగా నేర్పించాలట. కానీ.. తమ కొడుకు అంత గొప్ప, ఇంత గొప్ప అని అందరి ముందు మాత్రం అస్సలు చెప్పకూడదట. 
 

45


అందరి ముందు కొడుకుని పొగడటం వల్ల తండ్రి హేళనకు గురికావడమే కాకుండా మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తండ్రి తన కొడుకును ఇతరుల ముందు పొగడకూడదు.
 


మీ కొడుకు సద్గుణవంతుడు , గొప్పవాడు అయితే, అతని గుణాల గురించి చెప్పనవసరం లేదు. అతను ఎంత మంచివాడో, జీవితంలో ఏమి సాధించాడో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి లక్షణాలు అందరూ గుర్తించగలరు. మీరు చెప్పడం కాకుండా... వారిలో సద్గుణాలను ప్రపంచం గుర్తించేలా చేస్తే సరిపోతుందట.

55


మీరు మీ కుమారునికి మంచి విలువలు నేర్పి, అతనిని సద్గురువుగా మార్చడంపై దృష్టి పెడితే మంచిది. తండ్రిగా ఇది నీ కర్తవ్యం. అయితే.. మీరు మీ పిల్లలకు మంచి విషయాలు నేర్పించే సమయంలో.. వారిని తక్కువ చేయకూడడదు. ఇతరుల ముందు పొగడకూడదు అన్నారు కదా అని.. మీ పిల్లలను మీరు తక్కువ చేసి మాత్రం చూడకూడదు. వారికి ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్  ఇస్తూనే ఉండాలి.

click me!

Recommended Stories