పిల్లల చేతిరాత బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jun 1, 2024, 10:30 AM IST

పిల్లలకు ఏది నేర్పించాలన్నా చిన్నతనంలోనే నేర్పించాలి. ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు ఏ విషయాన్నైనా బాగా నేర్చుకుంటారు.అలాగే చిన్న పిల్లలకు హ్యాండ్ రైటింగ్ బాగా రావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నేటి పిల్లలు చదవడం, రాయడం కంటే మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడటం, వీడియోలను చూడటం పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ మొబైల్ ఫోన్ వాడకం పిల్లల బంగారు భవిష్యత్తుకు అడ్డుగోడలా నిలుస్తుంది. ఈ ప్రభావం పిల్లల చేతిరాతపై కూడా పడుతుంది. దీనివల్ల పిల్లల చేతిరాత బాగుండదు. దీనివల్ల ఎక్సామ్ లో మార్కులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. 
 

పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్లకు చదువు చాలా ముఖ్యం. అయితే చిన్నప్పటి నుంచే చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలపై ఒత్తిడి తెస్తుంది. కాకపోతే పిల్లలకు చదవడం, రాయడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే కొంతమంది పిల్లలకు రాయడంలో ఇబ్బంది తలెత్తుతుంది. అలాగే అక్షరాలను కూడా క్లారిటీగా రాయరు. దీనివల్ల చేతిరాత ఎవరికీ అర్థం కాదు. ఇది మీ పిల్లల మార్కులను కూడా తగ్గిస్తుంది. అందుకే పిల్లల చేతిరాత బాగుండటానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పెన్సిల్ ను ఎలా పట్టుకోవాలో నేర్పండి

పిల్లల చేతిరాత బాగుండాలంటే వారికి పెన్సిల్ ను సరిగ్గా ఎలా పట్టుకోవాలో నేర్పండి. చాలా మంది పిల్లలకు పెన్సిల్ ను ఎలా పట్టుకోవాలో తెలియదు. దీనివల్లే చేతిరాత బాగుండదు. పిల్లల చేతిరాత బాగుండాలంటే మూడు వేళ్లను అంటే బొటనవేలు, చూపుడు వేలు,మధ్యను ఉపయోగించి పెన్సిల్ పట్టుకోమని పిల్లలకు చెప్పండి. అలాగే మీ పిల్లల చేతిని పట్టుకుని వాటిని కలిపి రాయండి. అలాగే మీ పిల్లల్ని రాయమని చెప్పండి.
 

గీతలు గీయడం ప్రాక్టీస్ చేయించండి

పిల్లల్ని ఒక పేజీ తీసుకుని నిటారుగా, కర్ణం, వక్ర రేఖలను గీయడం ప్రాక్టీస్ చేసేలా చేయండి. ఇది వారి చేతిరాతపై నియంత్రణను తెస్తుంది. అలాగే మీ పిల్లల చేతిరాతను మెరుగుపరుస్తుంది. 
 

రోజూ రాయడం ప్రాక్టీస్ చేయించండి

పిల్లలు క్యాపిటల్ అక్షరాలు, స్మాల్ అక్షరాలను రాయడం ప్రాక్టీస్ చేయించండి. పిల్లలు అక్షరాలను గుండ్రంగా రాసేలా చూడండి. ముందు సరళమైన పదాలను ప్రాక్టీస్ చేయించండి. ఇది మెరుగుపడిన తర్వాత క్రమంగా కొద్దిగా సంక్లిష్టమైన పదాలను ప్రాక్టీస్ చేసేలా చూడండి. ఆ తర్వాత వాక్యాలను ప్రాక్టీస్ చేయించండి. అయితే ఈ ప్రాక్టీస్ రోజూ ఉండాలి. అప్పుడే రైటింగ్ బాగుంటుంది.
 

ట్రేస్ బుక్ పై ప్రాక్టీస్

చేతిరాతను మెరుగుపరచడానికి అక్షరాలు, సంఖ్యలతో కూడిన లెటర్ ట్రేస్ పుస్తకాలను మీ పిల్లలకు కొనియ్యండి. పిల్లలు ఈ ట్రేస్ పుస్తకం ద్వారా రైటింగ్ మెరుగుపరుచుకోగలుగుతారు. 
 

పెయింటింగ్, డ్రాయింగ్ పై దృష్టి పెట్టండి

పెయింటింగ్, డ్రాయింగ్ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే రోజూ మీ పిల్లలు పెయింటింగ్, డ్రాయింగ్ వేసేలా చూడండి. ఇది వారి సృజనాత్మకత, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

Latest Videos

click me!