ఈ సెలబ్రెటీలంతా తమ పిల్లల పేర్లు స్పెషల్ గా ఉండాలని ఏం చేశారో తెలుసా?

First Published | May 30, 2024, 5:06 PM IST

ఈ క్రమంలో రీసెంట్ గా కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ పిల్లలకు... సంస్కృతంలో  వెతికి మరీ పేర్లు పెట్టారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? వారి పిల్లల పేర్లు, వాటి అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం...

ప్రతి పేరెంట్స్ తమ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.  పేరు పెట్టే విషయంలో చాలా ఆలోచిస్తారు. ఈ విషయంలో  సెలబ్రెటీలు కూడా ఏమీ తీసిపోరు.  మనకంటే వాళ్లు మరీ ఎక్కువ ఆలోచిస్తారు.  కొంతకాలం క్రితం అందరూ... పిల్లలకు పేర్లు అంటే..  చాలా ట్రెండీగా ఉండాలి అనుకునేవారు. కానీ.. ఇప్పుడు పిల్లల పేర్ల విషయంలో అందరి ఆలోచనలు మారిపోయాయి. ట్రెండీ గా కంటే.. అర్థవంతంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ పిల్లలకు... సంస్కృతంలో  వెతికి మరీ పేర్లు పెట్టారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? వారి పిల్లల పేర్లు, వాటి అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం...


1.యామి గౌతమ్...
యామి గౌతమ్ బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ.. తెలుగులోనూ ఒకట్రెండు సినిమాలు  చేసి గుర్తింపు పొందారు. రీసెంట్ గా ఆమె ఓ బాబుకి జన్మనిచ్చారు. నామకరణం కూడా చేశారు. బాబుకి వేద్విద్ అనే పేరు పెట్టారు. వేద్విద్ అంటే వేదాలు తెలిసిన వాడు అని అర్థం అంట. వేదం అంటే సంస్కృత పదం. దీని అర్థం హిందూ మతంలో  జ్ఞానం లేదా పవిత్ర గ్రంథాలు. యామీ గౌతమ్ తన కొడుకు కోసం ఈ పేరు పెట్టడానికి కారణం ఇదే.
 


2.అనుష్క శర్మ..
విరాట్-అనుష్క తమ కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అకాయ్ అంటే.. దేహం లేని పరమ బ్రహ్మ అని పేరు. అదే సమయంలో, శివ సహస్రనామ లింగ పురాణం ప్రకారం, 'ఆకాయ్' కూడా శివుని పేరు. విరాట్-అనుష్క తమ కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టడానికి కారణం ఇదే.


3.అలియా భట్..
అలియా భట్ ,రణబీర్ కపూర్ కూడా తమ కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. ఈ పేరును అలియా అత్తగారు నీతూ కపూర్ ఎంపిక చేశారు. రాహ అంటే దైవిక మార్గం. సంస్కృతంలో వంశం అని అర్థం. తన కూతురి పేరులోని అర్థాన్ని స్వయంగా ఆలియా చెప్పింది.


4. ప్రియాకం చోప్రా..
ప్రియాంక చోప్రా కూడా తన కూతురికి చాలా ప్రత్యేకమైన పేరు పెట్టింది. నటి తన కుమార్తెకు మాల్తీ మేరీ అని పేరు పెట్టింది. మాల్టీ అనేది సంస్కృత పదం, అంటే సువాసనగల పువ్వు అని అర్థం.
 

Latest Videos

click me!