ఎండాకాలం పిల్లలు సరిగా తినడం లేదా..? ఈ ట్రిక్స్ వాడండి..!

First Published | May 31, 2024, 1:12 PM IST

ఇంట్లో ఉన్నా సరే.. వేసవిలో పిల్లలకు ఆకలి తగ్గుతుందట. అలాంటి సమయంలో... బలవంతంగా పిల్లలతో తినిపించకుండా, వారిలో ఆకలి పెంచేలా చేయాలి.
 

తిండి విషయంలో పిల్లలు మామలుగానే ఎక్కువ మారాం చేస్తూ ఉంటారు. పిల్లలకు ఫుడ్ తినిపించే సరికి తల్లులకు తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. మామూలు సమయంలోనే ఇలా ఉంటుంది అంటే... ఇక సమ్మర్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండాకాలం పిల్లలు సరిగా భోజనం చెయ్యరు. ఆకలి తగ్గిపోయిందా అనే అనుమానం కలుగుతుంది.  అయితే... ఈ కాలంలో పిల్లల ఆకలి పెంచడానికి ఈ చిట్కాలు వాడితే సరిపోతుందనినిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం....
 

ఇంట్లో ఉన్నా సరే.. వేసవిలో పిల్లలకు ఆకలి తగ్గుతుందట. అలాంటి సమయంలో... బలవంతంగా పిల్లలతో తినిపించకుండా, వారిలో ఆకలి పెంచేలా చేయాలి.
 


kids eating

ఫ్లూయిడ్స్ ఇవ్వండి... ఈ సమ్మర్ సీజన్ లో  పిల్లల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించి,  ఆకలిని పెంచేందుకు ఇది చక్కని మార్గం. దానికోసం పిల్లలకు ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి.  అంటే.. మిల్క్ షేక్స్ , కూరగాయాలు, పండ్ల రసాలు లాంటివి ఇవ్వాలి. ఇవి పిల్లల శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు... కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి.

kids eating

బ్రేక్ ఫాస్ట్.. అల్పాహారంలో పిల్లలకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి. అల్పాహారం మానేయడం వల్ల జీర్ణ సమస్యలు రావడమే కాకుండా జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు, ఆకలి కూడా పట్టదు. కాబట్టి, పిల్లలకు అల్పాహారంగా గంజి మరియు పచ్చి కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన వాటిని ఇవ్వండి.

kids eating


వారికి తినడానికి ఇవ్వకండి: సాధారణంగా పిల్లలు చిప్స్ , బిస్కెట్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే ఇవి తింటే కడుపు నిండుతుంది కాబట్టి తినలేరు. కాబట్టి, పిల్లలకు ఈ స్నాక్స్ కొనకండి. వాటికి దూరంగా ఉంచాలి.


ప్రతి రెండు గంటలకోసారి ఆహారం: పిల్లలకు ఒకేసారి తినిపించే బదులు ప్రతి 2 గంటలకొకసారి వారికి ఏదైనా తినండి. దీంతో వారి కడుపు నిండుతుంది. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా, వారి ఆకలి క్రమంగా పెరుగుతుంది.

Latest Videos

click me!