ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నగున్పప్పుడే ఏది మంచి? ఏది చెడు? వంటి విషయాలను చెప్తుంటారు. నిజానికి పిల్లలకు కొన్ని విషయాలను చిన్నప్పటి నుంచే చెప్పాలి. అప్పుడే పిల్లలు మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. చెడు వాటికి దూరంగా ఉంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఆదా చేయడం గురించి మాత్రం నేర్పరు. అందులోనూ పిల్లలు అడిగింది లేదనకుండా ప్రతీది కొనిస్తుంటారు. పిల్లల అవసరాలను తీర్చడంలో తప్పు లేదు. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మాత్రం నేర్పకూడదు. ఇది వారిని డబ్బు ఆదా చేయకుండా చేస్తుంది. నిజానికి పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు డబ్బు ఆదా చేయడం గురించి ఖచ్చితంగా నేర్పాలి. అది ఏ వయసులో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలకు డబ్బు ఆదా చేయడం ఏ వయసులో నేర్పించాలి?
చిన్న పిల్లలకు అంటే 4 సంవత్సరాల నుంచి డబ్బు పొదుపు చేసే అలవాటు గురించి ఖచ్చితంగా నేర్పించాలి. దీనివల్ల మీ పిల్లలు 7 నుంచి 8 సంవత్సరాల వయస్సులో మీ నుంచి పనికిరాని వస్తువులను కొనియ్యమని బలవంతం చేయరు. దీనివల్ల డబ్బు విలువను మీ బిడ్డ తెలుసుకుంటాడు. అనవసరంగా డబ్బును ఖర్చు చేయడం మానుకుంటాడు.
money saving
అవసరం గురించి చెప్పండి
తల్లిదండ్రులు పిల్లలు అడిగిన ప్రతి దాన్ని అంటే అవసరం లేని వస్తువులను కొనిచ్చే అలవాటును మానుకోవాలి. మీ పిల్లలు డబ్బు విలువను తెలుసుకోవాలంటే వారికి అవసరమైన దాన్ని మాత్రమే కొనివ్వండి. అలాగే అవసరానికి, కోరికకు మధ్య తేడా గురించి మీ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పండి. ఏవైనా సరుకులు అవసరం అయితే వాటిని మాత్రమే కొనుగోలు చేయండి. పిల్లలకు లేనిపోని కోరికలు ఉంటాయి. వీటిలో చాలా మటుకు అవసరానికి రానివే ఉంటాయి. కాబట్టి వారి అవసరాన్ని మాత్రమే తీర్చండి. అవసరానికి మించి మాత్రమే కొనే అలవాటును వారికి నేర్పండి.
Image: Getty
డబ్బు విలువను వివరించండి
చిన్నతనంలోనే పిల్లలకు డబ్బు విలువను ప్రతి తల్లిదండ్రులు తెలియజేయాలి. ఇందుకోసం పిల్లలకు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పండి. ఆ పనులు చేసినందుకు వారికి కొంత డబ్బు ఇవ్వండి. ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో.. డబ్బు కోసం వారు ఎంత కష్టపడాలో దీనిద్వారా తెలుసుకుంటారు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటారు. దీనివల్ల అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.
పిగ్గీ బ్యాంకులను కొనుగోలు చేయండి
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా పిగ్గీ బ్యాంకులు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీ పిల్లలకు డబ్బును ఆదా చేయడం నేర్పుతుంది. మీరు వారికి డబ్బు ఇచ్చినప్పుడల్లా వారికి ఆ డబ్బును పిగ్గీ బ్యాంకులో వేయమని చెప్పండి. దీనివల్ల మీ పిల్లలు చిన్న వయస్సు నుంచే పొదుపు గురించి ఆలోచిస్తారు. మీరు కావాలనుకుంటే మీరు పిగ్గీ బ్యాంక్ డబ్బుతో వారి కోసం వస్తువులను కూడా కొనండి.