జీర్ణక్రియలో సహాయాలు: సాధారణంగా, గర్భిణీ స్త్రీలు అపానవాయువు , మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. కుంకుమపువ్వు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది గ్యాస్ ,అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తహీనత సమస్యకు మంచిది: గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అందుకే, కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనత నయం అవుతుంది.
నిద్రను ప్రోత్సహిస్తుంది: గర్భధారణ సమయంలో ప్రతి రాత్రి ఒక కప్పు వెచ్చని కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.