కడుపుతో ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకూడదా..? మరి నొప్పి తగ్గించేదెలా?

First Published Jun 11, 2024, 3:12 PM IST

గర్భిణీలు అలా వేసుకోకూడదు. దాని ప్రభావం కడుపులో బిడ్డ మీద చాలా ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి.. ఆ పొరపాటు చేయకూడదు. మరి... ఇలా పెయిన్ కిల్లర్ కూడా వేసుకోకుండా నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం...
 

గర్భం దాల్చడం ఏ మహిళకు అయినా అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. అయితే..  గర్భం దాల్చగానే సరిపోదు. ఆ 9 నెలల పీరియడ్ లో.. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రకరకాల నొప్పులు, మూడ్ స్వింగ్స్, వాంతులు, వికారం , కళ్లు తిరగడం లాంటివి చాలానే ఉంటాయి. అక్కడితో ఆగిపోదు.. సాధారణంగా ఏ తలనొప్పో, కడుపులో నొప్పో వస్తే.. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. కానీ గర్భిణీలు అలా వేసుకోకూడదు. దాని ప్రభావం కడుపులో బిడ్డ మీద చాలా ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి.. ఆ పొరపాటు చేయకూడదు. మరి... ఇలా పెయిన్ కిల్లర్ కూడా వేసుకోకుండా నొప్పి తగ్గాలంటే ఏం చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా ప్రెగ్నెన్సీలో పెయిన్ కిల్లర్స్ ని  వైద్యులు కూడా సిఫార్సు చేయరు. కానీ... మరీ భరించలేని నొప్పి వచ్చినప్పుడు పారాసెట్మాల్  వాడొచ్చు. ఇది కాకుండా.. ట్రెమడాల్ కూడా వాడొచ్చట. ఈ రెండింటినీ కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ గా చెబుతూ ఉంటారు. కొందరికి అయితే... ఇవి కూడా తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. 

అసలు ఎలాంటి మెడికేషన్ లేకుండా కూడా మనం కొన్ని పనులు చేసి.. నొప్పిని తగ్గించుకోవచ్చట. దాని కోసం..  ముందు నుంచి మనం.. హెల్దీ లైఫ్ స్టైల్  ఫాలో అవ్వాలంట. రెస్ట్ కూడా వీలైనంత వరకు తీసుకోవాలి. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా ఇవి ఫాలో అయితే వీలైనంత వరకు నొప్పులు రాకుండా  ఉంటాయి.

అదనంగా, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా:

మంచి భంగిమపై దృష్టి పెట్టండి
కొన్ని స్ట్రెచ్చెస్ చేయాలి...
అరోమాథెరపీలో మునిగిపోండి.
వెనుక భాగంలో ఒత్తిడిని తగ్గించడానికి పక్కగా పడుకోండి
కాళ్ల మధ్య, ముఖ్యంగా మోకాళ్ల మధ్య దిండ్లు తీసుకోండి
సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించండి

గర్భధారణ సమయంలో నొప్పి నిర్వహణ అనేది కాస్త కష్టమే. ఎందుకంటే ఇది ఎప్పటికీ అంతం కాని చక్రంలా అనిపిస్తుంది. మీరు మందులు తీసుకోవాలనుకుంటున్నట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. నొప్పి-ఉపశమన మందులు సాధారణంగా ఉపయోగం కోసం సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ, కొన్ని ప్రమాదాలను కలిగించే మందులు ఉన్నాయి. కాబట్టి.. డాక్టర్ ని సంప్రదించకుండా వేటినీ వేసుకోకూడదు. వీలైనంత వరకు వాకింగ్, యోగా లాంటివి చేస్తూ ఉండాలి. 

Latest Videos

click me!