పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే ఏం చేయాలి?

First Published | Feb 27, 2024, 12:36 PM IST

కొంతమంది పిల్లలకు ఒక్కసారి చదివినా ఇట్టే గుర్తుండిపోతుంది. ఇంకొంతమంది పిల్లలకు ఐదారు సార్లు చదివినా గుర్తుండదు. అయితే పేరెంట్స్ కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం పిల్లలు చదివింది ఎప్పటికీ మర్చిపోరు. ఇందుకోసం పేరెంట్స్ ఏం చేయాలంటే? 

పిల్లలకు ఎక్సామ్స్ భయం ఎప్పుడూ ఉండేదే. అయితే కొంతమంది పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. అలాగే చదివింది అస్సలు మర్చిపోరు. అయితే అందరు పిల్లలు ఒకేలా ఉండరు. కొంతమంది పిల్లలు ఎన్ని సార్లు చదివినా మర్చిపోతుంటారు. పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే మెమోరీ పవర్ బాగుండాలి. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులకు జ్ఞాపకశక్తి చాలా ముఖ్యం. ఎంత చదివినా ఎక్సామ్ లో ప్రశ్నకు సమాధానం గుర్తులేకపోతే ఫెయిల్ అవుతారు. అందుకే మీ పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడానికి తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


మెదడుకు శిక్షణ..

అన్ని ప్రశ్నలకు మీ పిల్లలు ఆన్సర్ చెప్పాలటే మీ పిల్లల జ్ఞాపకశక్తికి పదును పెట్టాలి. పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి సుడోకు లేదా క్రాస్ వర్డ్ పజిల్స్ వంటి ఆలోచనా వ్యాయామాలు చేయించొచ్చ.

నిరంతర శిక్షణ

మీ పిల్లలు ఏదైనా నేర్చుకున్నప్పుడు దానిని మళ్లీ మళ్లీ రిపీట్ చేయమని చెప్పండి. అలాగే మీరు కూడా అడుగుతూనే ఉండండి. దీనివల్ల మీ పిల్లలకు ఆ విషయం బాగా గుర్తుండిపోతుంది. అలాగే పేరెంట్స్  పిల్లలు బయటికి చదివేలా చూడాలి. వాళ్లు చదివిన వాటిని రాసేటప్పుడు కూడా గట్టిగా చదవమని చెప్పాలి. 


షార్ట్ హ్యాండ్

పెద్ద పెద్ద వాక్యాలను గుర్తుంచుకోవడం పిల్లలకేంటి పెద్దలకు కూడా కష్టమే. అందుకే పిల్లలు పెద్ద పెద్ద పదాలను గుర్తుంచుకోలేరు. అందుకే పేరెంట్స్ పిల్లలకు కష్టమైన పదాలను చిన్న చిన్న పదాలుగా విడదీసి చెప్పాలి. దీంతో వారు ఆ పదాలను సులువుగా గుర్తుంచుకోవాలి. 
 

వ్యాయామం

నేర్చుకోవడం, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడానికి వ్యాయామం బాగా సహాయపడుతుంది.  ఏరోబిక్ వ్యాయామం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ పిల్లల బ్రెయిన్ ను షార్ప్ చేస్తుంది. అందుకే మీ పిల్లలు ఉదయం నిద్రలేవగానే కాసేపు ప్రాక్టీస్ చేయమని చెప్పండి.
 

వాటర్

మన మెదడు ఎక్కువగా నీటితో నిర్మితమైందన్న సంగతి మీకు తెలుసా? కొంచెం డీహైడ్రేషన్ కూడా మెదడు కుదింపు, జ్ఞాపకశక్తి బలహీనతకు కారణమవుతుందని తేలింది. అందుకే ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలి. 

సరైన నిద్ర

పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. అందుకే మీ పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే వాళ్లు ప్రతిరోజూ ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. 

ఆరోగ్యకరమైన ఆహారం

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వారి మెమోరీ పవర్ ను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే పిల్లలకు క్యాబేజీ, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాలను పెట్టాలి. వీటిలో విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి మెదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

Latest Videos

click me!