కోపంగా ఉన్నప్పుడు పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుసా?

First Published | Feb 26, 2024, 3:52 PM IST

వారు కోపంగా ఉన్నప్పుడు మనం వారి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి..? అసలు ఆ సమయంలో పిల్లలు పేరెంట్స్ నుంచి ఏం వినాలి అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలు చేసే పనులకు పేరెంట్స్ కి కోపం రావడం సహజం. అలాగే పేరెంట్స్ చేసే పనులకు పిల్లలకు కూడా విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. మనం వారికి నచ్చింది కోనివ్వకపోయినా, చెప్పినట్లు చేయకపోయినా వారు కోపం చూపిస్తారు. పిల్లలు కోపంలో ఉన్నప్పుడు పేరెంట్స్ కాదు కదా ఎవరు ఏం చెప్పినా వినరు. అలా అని ఆ సమయంలో వారిని పట్టించుకోకుండా వదిలేస్తే మొండిగా తయారౌతారు. లేదు.. అరుద్దామా.. కొడదామా అంటే.. ఇంకా చెయ్యిదాటి పోతారు. అయితే.. వారు కోపంగా ఉన్నప్పుడు మనం వారి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి..? అసలు ఆ సమయంలో పిల్లలు పేరెంట్స్ నుంచి ఏం వినాలి అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Kids food

1. పిల్లలకు కోపం వచ్చినప్పుడు వారిని తిరిగి అరవడం, కొట్టడం లాంటివి చెయ్యకూడదు. వారి ఎమోషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి ఎమోషన్ ని మీరు అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా వారికి తెలిసేలా చేయాలి. వారికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి, వారు చెప్పింది వినడానికి ప్రయత్నించండి. వారికి మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని మాటలు, చేతల రూపంలో చూపించాలి. నీ బాధను నేను అర్థం చేసుకోగలను అనే మాట మీరు వారికి ఆ సమయంలో చెప్పాలి.


parents


2.పిల్లలకు విపరీతంగా కోపం వచ్చినప్పుడు  చాలా ఒంటరిగా ఫీలౌతారు. తమకంటూ ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఆ సమయంలో మనం వాళ్ల పక్కన కూర్చొని  వాళ్లు ఒంటరి కాదని.. ఎప్పుడైనా, ఏ సమయంలో అయినా మీకు నేను ఉన్నాను అని వారితో చెప్పాలి. నువ్వు ఎంచెప్పినా నేను వింటాను అని చెప్పాలి.

Parents

3. కోపం కూడా ఒక ఎమోషన్ అనే విషయం ముందు పేరెంట్స్ తెలుసుకోవాలి. కోపం రాగానే.. పిల్లలు ఏదో నేరం  చేసినట్లుగా చూడకూడదు. ఒకే కోపం వచ్చిందా.. కోపం చూపించనివ్వండి.  అదే విషయాన్ని మీరు పిల్లలకు చాలా నార్మల్ గా తెలియజేయాలి. కోపం రావడం కూడా సహజం అనే విషయాన్ని వారికి చెప్పాలి.
 

Parents

4.ఇక.. పిల్లలకు కోపం వచ్చినప్పుడు వారిని దూరంగా వదిలేయకూడదు. వారి కోపం పోయేంత వరకు  వారితో మీరు ఉంటారు అనే విషయాన్ని చెప్పాలి. నీ కోపం పోయేంత వరకు  నేను నీతోనే ఉంటాను అని వారికి మీరు చెప్పాలి. వారి పక్కనే కూర్చోవాలి కూడా..

parents

5. వారికి కోపం రావడానికి కారణం తెలుసుకోవాలి. తర్వాత.. నిజంగా పిల్లలకు వచ్చిన కోపం నిజమైనదేనని, నీకు ఎంత కష్టం వచ్చింది అని చెప్పి వారితో ఎంపతీ చూపించాలి. అప్పుడు వారి కోపం తగ్గే అవకాశం ఉంటుంది.

parents

6.ఇక పిల్లలకు  కోపం వచ్చినప్పుడు మీరు వారికి ప్రేమ చూపించాలి.  మీరు వారిని ప్రేమిస్తున్నారని,  ఐలవ్ యూ అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల కూడా  వారికి వచ్చిన కోపం త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
 

Parenting Tips-

7. వారికి కోపం తగ్గేంత వరకు ఆగి.. అసలు ఏం జరిగిందని, ఎందుకు కోపం వచ్చిందని వారిని అడిగి తెలుసుకోవాలి. తర్వాత..  వారు చేసిన తప్పేంటి, రైట్  ఏంటి అనే విషయాన్ని వారికి వివరించాలి.

Latest Videos

click me!