పిల్లలు చెడు మాటలు మాట్లాడితే? తల్లిదండ్రులు ఏం చేయాలంటే?

First Published Feb 25, 2024, 1:38 PM IST

పిల్లలు తల్లిదండ్రుల, తమ చుట్టుపక్కల ఉన్నవారి నుంచే ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అది మంచైనా, చెడైనా.. మరి పిల్లలు చెడు మాటలు మాట్లాడితే వారిని ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పిల్లలు అమాయకులు. వీళ్లు తమ చుట్టూ ఉన్నవారి నుంచే ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. పిల్లలకు ఇది మంచి.. ఇది చెడు అన్న విషయాలు తెలియవు. అందుకే చుట్టుపక్కల వారు ఏం చేసినా.. ఏది మాట్లాడినా.. అచ్చం అలా చేయడానికి, మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. పిల్లలు పెద్దయ్యాకే.. ఏది మంచి.. ఏది చెడు అన్న విషయాలను తెలుసుకుంటారు. అయితే పిల్లలు చుట్టుపక్కల వారిని చూసి కూడా చెడు మాటలను నేర్చుకోవడం మొదలుపెడతారు. ట్యూషన్ కి వెళ్లినప్పుడు, స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు పిల్లలు ఎంతో మందిని కలుస్తారు. ఎన్నో మాటలను వింటారు. వాటిని పిల్లలు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. 

ముఖ్యంగా పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దలనే అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాళ్లు అన్న మాటలకు అర్థాలు తెలియకపోయినా.. అలాగే మాట్లాడుతుంటారు. అలాగే పెద్దలను చూసి చాలా పనులను కూడా పిల్లలు చేయాలనుకుంటారు. పిల్లలు అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు లేదా చెడు పనులను చేసినప్పుడు తల్లిదండ్రులకు సిగ్గుగా అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ముందే చెడు మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. దీంతో పిల్లలను తిట్టడమో, కొట్టడమో చేస్తుంటారు. కానీ పిల్లల్ని కొట్టడం వల్ల వారు మారరు. వారు మారాలంటే మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అవేంటంటే? 
 


చెడు మాటలు మాట్లాడటం

ఇది మనం ప్రతి ఇంట్లో చూస్తాం. పిల్లలు ఏదైనా తప్పుగా చెప్పినా, చెడుగా మాట్లాడిని వెంటనే కొట్టేస్తుంటారు. లేదంటే దాని గురించి ఎక్కువ భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తారు. కానీ ఇలాంటి పొరపాటు మీరు చేయకండి. పిల్లలు ఎన్నో విషయాలను చెప్తారు. తర్వాత మర్చిపోతారు. కానీ తల్లిదండ్రులు తిట్టినప్పుడు లేదా వారిని అనకూడని మాటలు అన్నప్పుడు వారికి అలాగే గుర్తుండిపోతాయి. మీరన్న ఆ పదం వారి మనసులో మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఈ పదం వారు కూడా మాట్లాడుతారు. అందుకే  పిల్లలలో చెడు మాటలను మాట్లాడకండి. ఒకవేళ ఆ పదం మాట్లాడితే అది ఎక్కడ విన్నారో తెలుసుకోండి. ఆ పదం వల్ల కలిగే అనర్థం గురించి వారికి అర్థమయ్యేలా చెప్పండి. 
 

ఇంటి వాతావరణం పట్ల శ్రద్ధ 

పిల్లలకు ఫస్ట్ స్కూల్ ఇళ్లే. ఇంట్లో ఉంటే పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల కొన్ని కొన్ని సార్లు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా తిట్టుకుంటూ ఉంటారు. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులను బాగా గమనిస్తారు. కాబట్టి మీ పిల్లల ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే.. ప్లీజ్, థ్యాంక్స్ వంటి గౌరవప్రదమైన పదాలను వారికి నేర్పండి. 
 

అసభ్యంగా మాట్లాడేటప్పుడు టీజింగ్

చాలా మంది తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తుంటారు. పిల్లలకు వారు అన్న పదాలకు అర్థాలు కూడా తెలియవు. అందుకే తెలియక అన్న పదాన్ని అంటే కొట్టడానికి బదులుగా ఆ పదానికి అర్థమేంటో చెప్పండి. అలాగే చాలా మంది చెడు మాటలు అన్నప్పుడు చాలా మంది తల్లిదండ్రులు నవ్వి ఊరుకుంటారు కానీ ఇది తప్పు అని చెప్పరు. ఇదే పిల్లలు చెడు మాటలు ఇంకా అనేలా చేస్తుంది. ఈ తప్పు మీరు మాత్రం చేయకండి. 


పిల్లలు ఇలాంటి పదాలను ఎలా నేర్చుకుంటారో చూడండి. మంచి మాటలకు, చెడు మాటలకు మధ్య తేడాను గుర్తించేలా చేయండి. అందుకే ఆ పదం అర్థం ఏంటో తెలుసా అని అడగండి. ఒకవేళ వద్దంటే ఆ పదం వల్ల కలిగే హాని గురించి వారికి చెప్పండి. 

వారిని ట్రాక్ చేస్తూ..

నేటి పిల్లలు మనకు తెలియకుండానే తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ ను వాడటం మొదలుపెట్టారు. వీళ్లు ఆన్లైన్ ప్రపంచంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. దీనివల్ల పిల్లలు తప్పుడు మాటలను నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండండి. అలాగే వాళ్లు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోవాలి. 
 

కొత్త పదాల కోసం..

ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఇది విన్న పిల్లలు అలాగే మాట్లాడుతారు. అందుకే వారితో ఉన్నప్పుడు మీరు తప్పుడు మాటలు మాట్లాడకండి. బదులుగా మంచి మాటలు మాట్లాడేలా చూడండి. 

click me!