పిల్లలు హెల్దీ ఫుడ్ తినేలా చేయడం ఎలా..?

First Published | Jun 8, 2024, 10:40 AM IST

పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తినకపోతే... తొందరగా జబ్బుల బారిన పడతారు. ఏవేవో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే.. కచ్చితంగా వారి డైట్ లో హెల్దీ ఫుడ్ ఉండేలా చూడాలి.
 

kids eating

పిల్లలకు తిండి తినిపించడం అంత ఈజీ కాదు.  ఏదైనా జంక్ ఫుడ్ అయితే.. మనం వద్దు అన్నా కావాలని మారాం చేసి మరీ తింటారు. కానీ.. అదే ఏదైనా ఆరోగ్యకరమైన ఫుడ్ ముఖ్యంగా, పండ్లు, కూరగాయలు తినిపించాలి అంటే మాత్రం.. తల్లులకు ప్రాణం మీదకు వచ్చేస్తుంది. కొట్టినా, తిట్టినా, బెదిరించినా... కూడా తినరు. దీంతో... హెల్దీ ఫుడ్స్ పిల్లలకు ఎలా అలవాటు చేయాలా అని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఈ కింది ట్రిక్స్ వాడి.. మనం పిల్లలకు హెల్దీ ఫుడ్ ని అలవాటు చేయవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం..
 

kids eating

పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తినకపోతే... తొందరగా జబ్బుల బారిన పడతారు. ఏవేవో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే.. కచ్చితంగా వారి డైట్ లో హెల్దీ ఫుడ్ ఉండేలా చూడాలి.

పిల్లలను ఇది మంచిది, నువ్వుతినాల్సిందే అని చెబితే తినరు. ముందు.. పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలంటే.. వాళ్లు చిన్నతనం నుంచే.. ఇంట్లో పెద్దలు తినడం మొదలుపెట్టాలి. మనం ఎలాంటి ఫుడ్  తింటే.. పిల్లలు కూడా అవే తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా  పిల్లలు పేరెంట్స్ నుంచి చూసే  నేర్చుకుంటారు.
 


kids eating

ఇక పిల్లలు... టీవీల్లో వచ్చే కార్టూన్స్ ని అమితంగా ఇష్టపడతారు. వాటి శక్తి సామర్థ్యాలను చూసి అబ్బురపడుతూ ఉంటారు. ఆ క్యారెక్టర్  అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఇలాంటి ఫుడ్ తినడం వల్లే జరుగుతుంది అంటూ.. పిల్లలకు చెబుతూ ఉండాలి. ఆ క్యారెక్టర్ లాగే తాము కూడా ఉండాలని పిల్లలు ఊహించి.. వాళ్లు కూడా ఆ ఫుడ్ తినడం అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

పిల్లలు.. ఏదైనా ఫుడ్ ఇష్టంగా తినాలి అంటే... ఆ ఫుడ్ ప్రిపరేషన్ లో వాళ్లను కూడా భాగం చేయాలి. అలా భాగం చేయడం వల్ల.. వారికి కూడా ఆఫుడ్ మీద ఆసక్తి పెరుగుతుంది. వంట వండే సమయంలో మాత్రమే కాకుండా... గ్రాసరీ షాపింగ్ చేయడంలో కూడా పిల్లలను భాగం చేయాలి. ఏది తింటే.. పిల్లలకు ఏ లాభం కలుగుతుందో కూడా చెప్పాలి. అప్పుడు వారికి ఇంట్రస్ట్ పెరుగుతుంది.
 

ఇక.. పిల్లలకు స్నాక్స్ సమయంలో బిస్కెట్లు, చాక్లెట్స్ కాకుండా.. నట్స్, ఫ్రూట్స్ లాంటి వాటిని ఇస్తూ ఉండాలి. అప్పుడు.. వాటిమీద ఆసక్తి పెరుగుతుంది.

పిల్లలకు మాములుగా హెల్దీ ఫుడ్ ఇచ్చి తినమంటే.. పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. కానీ అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్, వేటిని తింటే ఏ లాభం కలుగుతుంది అనే విషయం  వారికి అర్థమయ్యేలా చెప్పాలి. 
 

ఇక.. హెల్దీ ఫుడ్ ని ఎప్పుడూ ఒకేలా కాకుండా.. డిఫరెంట్ గా, చూడటానికి పిల్లలు ఆకర్షితులయ్యేలా చేసేలా చేయాలి. అప్పుడు పిల్లలు కూడ ఇష్టంగా తినడానికి ఆసక్తి  చూపిస్తారు.

ఇంట్లో తినకపోయినా పిల్లలు,.. స్కూల్లో తినడానికి ఇష్టపడతారు. పిల్లలు అందరూ ఉండటం , టీచర్ల భయం కారణంగా తింటారు.. కాబట్టి... స్కూల్ కి హెల్దీ ఫుడ్ పెట్టండి. అప్పుడు ఆ ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటారు.

నూడిల్స్ పిల్లలు ఇష్టపడతారు. అయితే.. మైదా పిండితో కాకుండా... రాగి, మిల్లెట్స్ లాంటి వాటితోనూ నూడిల్స్ దొరుకుతున్నాయి. వాటిని పిల్లలకు పెడుతూ ఉండాలి. 

Latest Videos

click me!