చదవని పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందంటే?

First Published | Dec 10, 2023, 3:55 PM IST

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని, భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు చదువులో చాలా బలహీనంగా ఉంటారు. దీంతో పిల్లలు చదువుపై పూర్తి దృష్టి పెట్టలేరు. ఇలాంటి పిల్లలు తరచుగా చదువుకోకపోవడానికి సాకులు వెతుక్కుంటారు. అందుకే చదువులో బలహీనంగా ఉన్న పిల్లలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

చిన్న పిల్లలు అంత తొందరగా చదువుపై ఏకాగ్రతను పెట్టలేరు. చదువు కోసం స్వతహాగా ముందుకు వచ్చే పిల్లలు చాలా తక్కువ. ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దయ్యాక చదువుపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం పిల్లల చదువులు, వారి ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. ఇది వారిని చదువులో బలహీనంగా చేస్తుంది. అందుకే చదువులో బలహీనమైన పిల్లల అలవాట్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

చదువులో బలహీనంగా ఉన్న పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడరు. అంటే స్కూల్ కు వెళ్లకుండా ఉండేందుకు ఎన్నో రకాల సాకులను చెప్తుంటారు. ఇలాంటి పిల్లలు హోం వర్క్ ను నేను తర్వాత చేస్తాను అంటూ ప్రతి సారి వాయిదా వేస్తూ ఉంటారు. 

పలు అధ్యయనాల ప్రకారం.. చదువులో బలహీనంగా ఉండే పిల్లలు తరగతిలో వెనుక బెంచ్ లో కూర్చుంటారు. వెనుక బెంచ్ లో ఉన్న పిల్లలంతా చదవరని కాదు. ఏదేమైనా ముందు బెంచ్ లో కూర్చుంటే పాఠాలను మరింత అర్తం చేసుకుంటారు. 
 


చదువులో బలహీనంగా ఉన్న పిల్లలు ఎప్పుడూ కూడా టీచర్ ఇచ్చిన హోం వర్క్ ను కంప్లీట్ చేయరు. చదువుపై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు కారణం.

చదువులో వీక్ గా ఉన్న పిల్లలు క్లాసులో చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే టీచర్ వీళ్లను చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీళ్లకు ఏం అర్థం కాకపోయినా.. టీచర్ దగ్గరకు మాత్రం వెళ్లరు. 

ఒంటరిగా చదువుకుంటానని పట్టుబట్టే పిల్లలు చదువుకోవడానికి ఎప్పుడూ ఒకే ప్రదేశాన్ని వెతుకుతారు. ఎందుకంటే వీళ్లు చదివినా చదవకపోయినా ఎవరూ చూడరు కాబట్టి. ఎవరూ లేని ప్లేస్ లో చదకున్నా ఏం కాదని అనుకుంటారు. కానీ ఇది వారి చదువును, జీవితాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అందుకే మీ పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా చదువుకోనియకండి.
 

ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండడానికి ఎంతో కష్టపడతారు. ఇలాంటి పరిస్థితిలో.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ముందు వరుసలో చూడాలని కోరుకుంటారు. దీని కోసం వారు మరింత చదవాలని వారిపై ఒత్తిడిని తెస్తుంటారు. కానీ దీనివల్ల తల్లిదండ్రుల అంచనాలను అందుకోకపోవడంతో పిల్లలు ప్రతిదానిలో వెనకబడుతుంటారు. 

పరీక్షలు వచ్చాయంటే..  ఏడాదిలో ఒక్కసారి కూడా చదవని పుస్తకాలను ఒక్కరోజులోనే చదవాలన్న కసిమీద ఉంటారు. కానీ ఇలా చదవడం వల్ల ఏం అర్థం కాదు. ఒకవేళ ఇలా చదివినా పరీక్షలో ఏం గుర్తుండదు. ఈ అలవాటు చదువులో వీక్ గా ఉన్న పిల్లల్లోనే కనిపిస్తుంది. 

ప్రణాళిక లేకుండా చదివే పిల్లలు ఏ సబ్జెక్టును కూడా కంప్లీట్ చేయలేరు. దీనివల్ల అన్ని సబ్జెక్టుల్లో వెనబడిపోతుంటారు. దీనివల్ల చదువులో వీళ్లు వీక్ గా ఉంటారు. చదువులో వీక్ గా ఉండే పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు చాలా తెలివిగా వివరించి వారిని ఎప్పుడూ ప్రోత్సహించాలి. అలాగే హోం వర్క్ కంప్లీట్ చేసేదాకా మీరు వారితోనే ఉండాలి. 

Latest Videos

click me!