పిల్లలతో ట్రైన్ లో వెళ్తే ఏం చేయాలో తెలుసా?

First Published | Nov 20, 2024, 4:32 PM IST

ట్రైన్ జర్నీ తరచుగా చేసే వారు చాలా మందే ఉన్నారు. కానీ మీరు పిల్లలతో ట్రైన్ లో వెళ్తున్నట్టైతే మాత్రం కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే?

ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుంది. ఇది బస్సు, కారు కంటే చాలా కంఫర్ట్ గా, సేఫ్ గా ఉంటుంది. అందుకే దూర ప్రయాణాలకు లేదా దైవ దర్శణాలకు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారు ఎక్కువగా ట్రైన్ లోనే వెళ్తారు.  అయితే చిన్న పిల్లలు ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇది మీకే కాకుండా.. మీ పక్కవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా జరగకూడదంటే ఏం చేయాలో తెలుసా?

కొంతమంది పిల్లలు కొత్తదానికి తొందరగా అలవాటు పడరు.అందుకే ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఏడుస్తుంటారు. కాబట్టి మీరు కూడా పిల్లలతో ట్రైన్ లో వెళుతుంటే గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


పిల్లలతో రైలు ప్రయాణం

పిల్లలతో రైలులో వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:

సరైన సమయం 

ఎప్పుడైనా సరే పిల్లలతో ట్రై జర్నీ ప్లాన్ చేసుకుంటే.. మీరు ఖచ్చితంగా మీ పిల్లల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే వారు తినడానికి, పడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడే పిల్లలు ట్రైన్ లో ఎలాంటి ఇబ్బంది పడరు.

అవసరమైన వస్తువులు:

పిల్లలకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కానీ వారికి అవసరమైనవి ఏంటో తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది. కాబట్టి పిల్లల్తో రైలులో ప్రయాణం చేసేటప్పుడు అవసరమైన నీళ్లు, స్నాక్స్, మందులు, వారికి అవసరమైన బొమ్మలు వంటి అవసరమైన వస్తువులను మీ వెంటే తీసుకెళ్లండి.

పిల్లల భద్రత

రైలు చాలా సేఫ్ ప్లేస్ అని పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయకూడదు. ముఖ్యంగా పిల్లల్ని ట్రైన్ కిటికీలు లేదా తలుపుల దగ్గర ఒంటరిగా అస్సలు వదిలివేయకూడదు.

పిల్లలను ఆనందంగా ఉంచండి

రైలులో మీరు ఎక్కువ సేపు జర్నీ చేయాల్సి వస్తే వారిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అంటే పిల్లల్నిఎక్కువ సేపు మాట్లాడటం, వారికి ఇష్టమైన బొమ్మలను లేదా ఆట సామాగ్రిని ఇవ్వడం లాంటివి చేయాలి. 

ఆహారం

పిల్లలకు కొన్ని కొన్ని ట్రైన్ లో అమ్మే ఫుడ్ నచ్చకపోవచ్చు. దీనివల్ల వారు తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ముందే ఇంటి నుంచి వండిన ఆహారాన్ని మీ వెంట తీసుకెళ్లండి. 

ఆరోగ్య సంరక్షణ

చలికాలంలో పిల్లలతో జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకు ట్రైన్ లో చలిపెట్టొచ్చు. ఇది వారికి జలుబు, జ్వరం వచ్చేలా చేస్తుంది. కాబట్టి వారికి చలి పెట్టకుండా వేడిగా ఉంచే దుస్తులు వేయాలి. 

బాత్రూమ్ వాడకం

పిల్లలకు ట్రైన్ లో బాత్ రూం ను ఎలా వాడాలో తెలియకపోవచ్చు. దీనివల్ల మీరు, మీ పిల్లలు ఇబ్బంది పడొచ్చు. కాబట్టి వారికి ముందే బాత్ రూం ను ఎలా వాడాలో నేర్పిండి. అలాగే మీరు కూడా వారితో వెళ్లండి. 

click me!