చదువే పిల్లలకు తల్లిదండ్రులిచ్చే పెద్ద ఆస్తి. అయితే కొంతమంది పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటే.. మరికొంతమంది పిల్లలు మాత్రం బాగా వెనకబడి ఉంటారు. కొంతమంది పిల్లలకు ఒక్కసారి చదివినా ఎప్పటికీ గుర్తిండిపోతుంది. కానీ కొంతమంది పిల్లలు గంటల తరబడి కూర్చుని చదివినా అస్సలు గుర్తుండదు. దీనివల్ల పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తాయి.
పిల్లలు చదివింది మర్చిపోవడం తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. మీ పిల్లలు కూడా చదివింది గుర్తుంచుకోకపోతుంటే ఈ చిట్కాలను పాటించండి. దీనివల్ల మీ పిల్లలు చదివింది అస్సలు మర్చిపోరు. అవేంటంటే?
పిల్లలు చదివినది మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి 4 మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
1. అర్థం చేసుకుని చదవమనండి:
పిల్లలు గంటల తరబడి ఒకేదగ్గర కూర్చోగలుగుతారు. చదవగలుగుతారు. ఇది పెద్ద విషయం కాదు. కానీ పిల్లలు ఎలా చదువుతున్నారనేది ముఖ్యం. అంటే పిల్లలు చదివింది మర్చిపోకూడదంటే ముందు వారు పాఠాన్ని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయగలుగుతారు.అందుకే ఏవైనా సులభమైన పదాలను గుర్తుంచుకుని కూడా చదవమని వారికి చెప్పండి.
పిల్లలకు చదువు చిట్కాలు
2. స్నేహితులకు చెప్పడం:
మీ పిల్లలు చదివింది గుర్తుంచుకోవాలంటే.. వారు చదివిన దాన్ని స్నేహితులకు చెప్పమని చెప్పండి. చదివింది ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు చదివింది బాగా గుర్తుండిపోతుంది. అలాగే ఎప్పటికీ మర్చిపోరు.
3. మళ్లీ చదవడం:
మీ పిల్లలు చదివింది వారి ఫ్రెండ్స్ కు చెప్పినా.. గుర్తుండకపోతే మళ్లీ చదవమని చెప్పండి. అలాగే పుస్తకాలను చదవడంతో పాటుగా యూట్యూబ్, గూగుల్ సోషల్ వీడియోల ద్వారా కూడా పాఠాలను నేర్చుకోమనండి. ఎందుకంటే కొంతమంది పిల్లలకు చదవడం కంటే విని, చూసిన ద్వారానే ఎక్కువగా అర్థం చేసుకుంటారు. నేర్చుకుంటారు. కాబట్టి మీ పిల్లలు చదివింది మర్చిపోతుంటే ఈ చిట్కాను ట్రై చేయండి.
4. సమీక్షించాలి:
మీ పిల్లలు చదువుతున్నప్పుడు దాని ద్వారా వాళ్లు ఏం నేర్చుకుంటున్నారు? వారి ఫ్రెండ్స్ కు ఎలా చెబుతున్నారు? అనే దాని గురించి సమీక్షించండి. దీనివల్ల పిల్లలు చదివింది ఎప్పటికీ మర్చిపోరు. అలాగే పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తాయి.