మీ పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారా? ఈ విషయాలను తప్పక చెప్పండి

First Published Feb 28, 2024, 10:54 AM IST

పిల్లల్ని ఇంట్లో వదిలేసి పనులపై తల్లిదండ్రులు బయటికి అప్పుడప్పుడు వెళ్తుంటారు. కానీ పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం అంత మంచిది కాదు. అలాగే బయటకు వెళ్లే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని విషయాలను ఖచ్చితంగా చెప్పాలి. అవేంటంటే?
 

చిన్న పిల్లలకు ఏదీ తెలియదు. ఎంతో అమాయకంగా ఉంటారు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంటారు. అందుకే చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలేసేవారు పిల్లలకు  కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. దీనివల్ల మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. ముందే ఈ మధ్య చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు బాగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఇంట్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి విషయాలను చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తెలియని వ్యక్తితో మాట్లాడొద్దు

తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం సాధ్యం కాకపోవచ్చు. అందుకే మీరు బయటకు వెళుతున్నప్పుడు మీ పిల్లలకు ఎవరైనా తెలియని వ్యక్తులు ఇంటికి వస్తే వారితో మాట్లాడొద్దని చెప్పాలి. అంతేకాదు వాళ్లను ఇంట్లోకి కూడా రానీయకూడదని చెప్పాలి. 


బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ 

ఇంట్లో ఒంటరిగా ఉండే పిల్లలకు డెలివరీ బాయ్ లను అసలే ఇంట్లోకి రానీయకూడదని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లలను చూసి దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. అందుకే మీ పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు బయటి నుంచి ఏమీ ఆర్డర్ చేయకూడదని చెప్పాలి.
 

వంటగది

మీ పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తే.. వాళ్లను ఒంటరిగా ఇంట్లో వదిలేసే ముందు వంటగదికి తాళం వేయాలి. లేదంటే వాళ్లు గ్యాస్ ను ఆన్ చేసే ప్రమాదం ఉంది. మీరు బయటకు వెళ్లే ముందు వారికి తినడానికి ఫుడ్, వాటర్ ను బయట పెట్టి కిచెన్ కు తాళం వేయండి. 

కాల్ చేయమని చెప్పండి

మీ పిల్లలకు ఏదైనా అవసరం ఉంటే మీకు వెంటనే ఫోన్ చేయమని మీ పిల్లలకు చెప్పండి. అందుకే మీరు బయటకు వెళ్లే ముందు మీ నంబర్ ను వారికి చెప్పండి లేదా మీరు నంబర్ రాసి మీ పిల్లలకు ఇవ్వండి. 

టాస్క్ ఇవ్వండి

పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారు. అలాగే పిల్లలను ఖాళీగా అసలే ఉంచకూడదు. అందుకే వాళ్లకు ఏదైనా పని చెప్పండి. స్కూల్ హోం వర్క్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పండి. దీంతో మీరు ఇంటికి వచ్చే వరకు మీ పిల్లలు బిజీగా ఉంటారు.

click me!