ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలా?

First Published | Feb 27, 2024, 2:32 PM IST

గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపుతో ఉన్నప్పుడే డయాబెటీస్, థైరాయిడ్ వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎన్నో విధులను నిర్వహిస్తుంది. ఇది సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో థైరాయిడ్ ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే జీవక్రియకు సహాయపడుతుంది. మొత్తం శ్రేయస్సును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. కానీ దీనివల్ల తల్లి, లోపల పెరుగుతున్న పిండంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే థైరాయిడ్ పరీక్ష అనేది ప్రినేటల్ కేర్‌లో ఒక ముఖ్యమైన భాగమని నిపుణులు డాక్టర్ ప్రీతి కబ్రా చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై  డాక్టర్ ప్రీతి కబ్రా ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

thyroid during pregnancy

థైరాయిడ్ హార్మోన్లు, గర్భం

థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా థైరాక్సిన్ (T4), ట్రైయోడోథైరోనిన్ (T3).ఇవి జీవక్రియ, శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తేనే కడుపులో పిండం పెరుగుదల బాగుంటుంది. కానీ ఈ సమయంలో చాలా మంది గర్భిణులు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యల బారిన పడుతుంటారు. కానీ ఇది గర్భిణులను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. బిడ్డ ఆరోగ్యం కూడా రిస్క్ లో పడుతుంంది. 
 


pregnancy

థైరాయిడ్ టెస్ట్ ప్రాముఖ్యత

హైపోథైరాయిడిజం ను గుర్తించడం

హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను తయారుచేయదు. దీనివల్ల అలసట, బరువు పెరగడం, పిండం అభివృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే  థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH), ఫ్రీ థైరాక్సిన్ (ఫ్రీ T4) అనేవి హార్మోన్ ను కొలిస్టే టెస్ట్ లు. ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడిజంను గుర్తించి, దాన్ని నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
 

హైపర్ థైరాయిడిజం నిర్వహణ

హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి అవసరమైన వాటికంటే ఎక్కువ హార్మోన్లను తయారుచేస్తుంది. ఇది ఆందోళన, గుండెకొట్టుకునే వేగం పెరగడం, బరువు తగ్గడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల పిల్లలు సమయం కంటే ముందుగానే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. రెగ్యులర్ థైరాయిడ్ పరీక్ష ద్వారా దీన్ని ముందుగానే గుర్తించొచ్చు. అలాగే తరచుగా మందులను వాడితే కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. 
 

థైరాయిడ్ పనిచేయకపోవడం వల్ల ప్రీఎక్లంప్సియా, ప్రెగ్నెన్సీ డయాబెటీస్,  Postpartum thyroiditis వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టెస్ట్ ల ద్వారా థైరాయిడ్ పనితీరును పర్యవేక్షించడం వల్ల ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. 

పిండం అభివృద్ధికి భరోసా

పిండం, మెదడు, నాడీ వ్యవస్థ సరైన అభివృద్ధికి థైరాయిడ్ హార్మోన్లు చాలా చాలా అవసరం. గర్భధారణ సమయంలో సరిపోని థైరాయిడ్ పనితీరు పిల్లల్లో మేధో, అభివృద్ధి సమస్యలకు దారితీయొచ్చు. థైరాయిడ్ టెస్ట్ ఆరోగ్యకరమైన పిండం అభివృద్ధికి సరైన హార్మోన్ స్థాయిలను నిర్ధారించడానికి సహాయపడుతుంది.
 

Image: Getty

ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ పరీక్ష కేవలం సాధారణ చెకప్ మాత్రమే కాదు. ఇది తల్లి, గర్బంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక ముందడుగు. కాబోయే తల్లులు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన టెస్ట్ లు చేయించుకోవాలి. అలాగే  థైరాయిడ్ టెస్ట్ లు వారి ప్రినేటల్ కేర్‌లో ఒక సాధారణ భాగమని అర్థం చేసుకోవాలి.  థైరాయిడ్ ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం వల్ల గర్భదారణలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే మొదటి నుంచి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

Latest Videos

click me!