ఆడపిల్లలు పేరెంట్స్ నుంచి అస్సలు వినకూడదు అనుకునేవి ఇవే..!

First Published | Feb 27, 2024, 1:05 PM IST

 ఇలాంటి మాటలు వినడానికి అమ్మాయిలు ఇష్టపడరు. తమకు నచ్చిన కెరీర్ ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వొచ్చు కదా అని అనుకుంటారు.
 

girl child

ప్రతి పేరెంట్స్.. తమ పిల్లలను సంతోషంగా ఉండాలనే అనుకుంటారు. కానీ ఎక్కువ మంది ఇంట్లో ఆడపిల్ల, మగపిల్లలు ఉంటే.. భిన్నంగా చూస్తారు. మగ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు.  కానీ ఆడపిల్లలకు మాత్రం ఫుల్ ఆంక్షలు పెడతారు. అది చేయ్యకూడదు.. ఇది చెయ్యకూడదు అని చెబుతూ ఉంటారు. నిజానికి మన ఇండియన్ ఫ్యామిలీల్లో ఆడపిల్లలు పేరెంట్స్ ఆంక్షలను అస్సలు భరించలేరు. ముఖ్యంగా.. వారు కొన్ని మాటలను అస్సలు వినడానికి ఇష్టపడరు. మరి అవేంటో ఓసారి  చూద్దాం...

1. ఇంట్లో అబ్బాయిలు షార్ట్స్ వేసుకొని తిరిగినా ఏమీ అనరు. కానీ ఆడపిల్లలు కొంచెం మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఒప్పుకోరు. మన కుటుంబానికి మర్యాద ఎక్కువ. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని పేరెంట్స్ చెప్పడం  ఆడపిల్లలకు అస్సలు నచ్చదు. దుస్తులు ఫ్యామిలీని బట్టి కాదు.. వాళ్ల కంఫర్ట్ ని బట్టి వేసుకోనివ్వాలి.
 


2.ఇక.. ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా అని చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. వారికి 20ఏళ్లు దాటాయో లేదో.. పెళ్లి పెళ్లి ని వాయిస్తూ ఉంటారు. కానీ.. చాలా మంది అమ్మాయిలకు  ఇంట్లో నీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి  ఎప్పుడు చేసుకుంటావ్ లాంటి ప్రశ్నలు అడుగుతుంటే వారికి అస్సలు నచ్చదు. ఈ ప్రశ్నలు వినడానికి వీరు ఇష్టపడరు.

3.ఇంట్లో అబ్బాయిలు ఉంటే.. వారికి వారి లక్ష్యం మీద ఫోకస్ పెడితే వావ్ అని మెచ్చుకుంటారు. అదే అమ్మాయిలను అయితే.. ఇఫ్పుడు నీకు ఉద్యోగం అవసరమా.. ఇంటిని చూసుకుంటే సరిపోదా అని అంటూ ఉంటారు. కానీ.. ఇలాంటి మాటలు వినడానికి అమ్మాయిలు ఇష్టపడరు. తమకు నచ్చిన కెరీర్ ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వొచ్చు కదా అని అనుకుంటారు.
 

Girl Child

4.చాలా మంది ఇంట్లో ఆడపిల్లలను నెమ్మదిగా మాట్లాడమని అంటూ ఉంటారు. ఆడపిల్లలు గట్టిగా మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. ఎలా మాట్లాడాలో కూడా కంట్రోల్  చేస్తుంటే ఆడపిల్లలకు పెద్దగా నచ్చదు.

girl

5.ఇక ఆడపిల్లలకు పదేళ్లు వచ్చినప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం నేర్పిస్తారు. పెళ్లి తర్వాత వంట రాకపోతే ఇబ్బందిపడతావ్ అని అంటూ ఉంటారు. వంట నేర్పించడం తప్పు కాదు.. కానీ పెళ్లి తర్వాత అమ్మాయిలే వంట చేయాలి అనే మాటలు వినడానికి పెద్దగా ఇష్టపడరు.

6.ఇక పెళ్లి తర్వాత ఆడపిల్లలు తమ కెరీర్ ని పక్కన పెట్టేయాలని, భర్త ను, భర్త కుటుంబాన్ని చూసుకుంటే చాలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు కూడా చాలా మంది అమ్మాయిలకు వినడానికి అస్సలు నచ్చదు. తమకంటూ ఓ కెరీర్ ఉంటుందని గుర్తిస్తే చాలు అని కోరుకుంటారు.
 

7.అంతేనా.. పెళ్లి అవ్వడం ఆలస్యం ప్రతి ఒక్కరూ పిల్లలు ఎప్పుడూ అని అడుగుతూనే ఉంటారు. ఆ మాట వినడం చాలా మంది అమ్మాయిలకు నచ్చదు. తమకు నచ్చినప్పుడు పిల్లల్ని కంటాం కదా.. ఆ విషయాన్ని అడగడం ఎందుకు అన్నట్లుగా భావిస్తారు.
 

7.అంతేనా.. పెళ్లి అవ్వడం ఆలస్యం ప్రతి ఒక్కరూ పిల్లలు ఎప్పుడూ అని అడుగుతూనే ఉంటారు. ఆ మాట వినడం చాలా మంది అమ్మాయిలకు నచ్చదు. తమకు నచ్చినప్పుడు పిల్లల్ని కంటాం కదా.. ఆ విషయాన్ని అడగడం ఎందుకు అన్నట్లుగా భావిస్తారు.

girl child

8.ఆడపిల్ల పుట్టింది అంటే చాలు... ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వాలని, ఆడపిల్లవి.. అన్నింటికీ సర్దుకోవాలని చెబుతూ ఉంటారు. ఆ మాటలు వినడానికి కూడా చాలా మంది అమ్మాయిలకు నచ్చదు. మేమే ఎందుకు సర్దుకుపోవాలి అనుకుంటూ ఉంటారు.

9.పెళ్లి తర్వాత ఏం జరిగినా... అత్తగారి కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని, వారి తర్వాతే.. పుట్టింటిని పట్టించుకోవాలి అని అంటూ ఉంటారు. ఈ మాటలు కూడా చాలా మంది అమ్మాయిలకు నచ్చదు. తమ పుట్టింటిని చూసుకునే హక్కు కూడా తమకు ఇస్తే బాగుంటుందని, అత్తగారి కుటుంబం కూడా తమకు విలువ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు.
 

Latest Videos

click me!