చుట్టాల ముందు పిల్లల్ని తిడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 22, 2024, 12:25 PM IST

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో అందమైన దశ. కల్మషం లేని పిల్లలు ఆటపాటలతో ఎంతో సరదాగా గడుపుతారు. కానీ పిల్లల చేష్టలు కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులకు చిరాకు, కోపం తెప్పిస్తాయి. ఇంకేముంది  ఇంట్లో ఎవరున్నారు, ఎక్కడున్నారని చూడకండి పిల్లల్ని చెడా, మడా తిట్టేస్తుంటారు. 

పిల్లల పెంపకమనేది అంత సులువైన పనేం కాదు. ఇది సవాలుతో కూడుకున్నది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేది చాలా తక్కువ. తుంటరి పిల్లలైతే పేరెంట్స్ ఏం చెప్పినా కేర్ చేయరు. కానీ కొంచెం శ్రద్ధ పెడితే తల్లిదండ్రులు పిల్లల్ని గొప్ప వ్యక్తులుగా తయారుచేయగలుగుతారు. 

పిల్లల పెంపకంలో ఓర్పు, అవగాహన, ప్రేమ చాలా చాలా అవసరం. కానీ పిల్లలు చేసే కొంటె పనుల వల్ల తల్లిదండ్రులు వారిని బాగా కోపగించుకుంటుంటారు. అరుస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు కొడుతుంటారు కూడా. ముఖ్యంగా ముఖ్యంగా స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, బంధువుల ముందు కూడా చెడామడా తిట్టేస్తుంటారు. కానీ ఇలా పిల్లల్ని బయటివ్యక్తుల మందు తిట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? 
 


మొండిగా మారొచ్చు 

పిల్లల మనసు సుతిమెత్తగా ఉంటుంది. అంటే పిల్లల్ని ఎలా పెంచితే అలా తయారవుతారన్న మాట. మీకు తెలుసా? పిల్లలు ఏ విషయాన్నైనా చాలా సులువుగా స్వీకరిస్తారు. పేరెంట్స్ తమ పిల్లల్ని అందరి ముందు తిట్టడం వల్ల వారి మనసుపై చెడు ప్రభావం పడుతుంది. అందరిముందు పిల్లల్ని తిడితే పిల్లలకు కోపం బాగా వచ్చి మొండిగా ప్రవర్తిస్తారు. అంతేకాదు పేరెంట్స్ కు తామంటే ఇష్టంలేదనే భావన కూడా వారికి కలుగుతుంది. అంతేకాదు ఇది మీతో వాధనకు దిగేలా కూడా చేస్తుంది. 

ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

బయటివ్యక్తుల ముందు పిల్లల్ని తిట్టడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యమే కాదు శారీరక  ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మీకు తెలుసా? తల్లిదండ్రుల తిట్లు, కోపం మీ పిల్లల్ని శారీరకంగా బలహీనంగా చేస్తాయి. అలాగే పిల్లలు ఎప్పుడూ గురవుతారు. దీనివల్ల వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇది వారిని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. పిల్లలు తరచూ అనారోగ్యానికి గురికావడం వల్ల పిల్లల శారీరక ఎదుగుదల కూడా తగ్గుతుంది. 

చదువుపై ప్రభావం

చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నట్టుగా కూడా తెలియదు. ఈ ఒత్తిడి వల్ల పిల్లలకు స్కూల్ లో సమస్యలు, ఫ్రెండ్స్ తో గొడవల వల్ల  లేదా ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం వంటి వివిధ కారణాల వల్ల కావొచ్చు. ఇలాంటి సమయంలో మీరు పిల్లల్ని ఇతరుల ముందు తిడితే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. ఇది పిల్లలకు చిరాకు, కోపం లేదా నిరాశను కలిగిస్తుంది. దీనివల్ల పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. అలాగే నిద్రలేమి సమస్య బారిన కూడా పడొచ్చు. 

విషయం చేయిదాటిపోతుంది

అందరి ముందు పిల్లల్ని తిట్టడం వల్ల వారు చెడుగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. ఇది మీ పిల్లలకు క్రమ శిక్షణ లేకుండా పోతుంది. అలాగే పెద్దలను గౌరవించరు. ఇది మీకు, మీ పిల్లలకు మధ్య గ్యాప్ ను ఏర్పరుస్తుంది. బహిరంగ ప్రదేశాలలో పిల్లల్ని తిట్టడం వల్ల ఇబ్బంది వారు అవమానంగా భావిస్తారు. ఇది వారి సామాజిక నైపుణ్యాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీ పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఇష్టడతారు. 

Latest Videos

click me!