ఇక.. ఆమె తన పిల్లలను ఇతరుల పట్ల దయతో ఉండేలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సమాజం పట్ల దయగా, ఇతరులకు సహాయం చేసేలా ఉండాలని నేర్పించారట. ఇక పిల్లలను ఎవరిమీద ఆధారపడకుండా... స్వతంత్రంగా ఉండేలా నేర్పించాలని ఆమె చెబుతూ ఉంటారు. వారి నిర్ణయాలు వారు తీసుకునేలా ప్రోత్సహించాలని చెబుతుంటారు.
ఇక మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ, సంప్రదాయాలకు కచ్చితంగా విలువ ఇవ్వాలని ఆమె చెబుతుంటారు. ఇది కూడా పిల్లలు... తమ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. కొత్త విషయాలు, కొత్త సంస్కృతులు తెలుసుకుంటూనే... మన సంప్రదాయాలకు విలువ ఇవ్వాలని ఆమె చెబుతుంటారు.