పిల్లల ఎత్తును పెంచడానికి తల్లిద౦డ్రులు ఏం చేయాలంటే?

First Published | Jul 28, 2024, 3:24 PM IST

కొంతమంది పిల్లలు వాళ్ల ఏజ్ కంటే చాలా పొడుగ్గా పెరుగుతుంటారు. మరికొంతమంది పిల్లలు మాత్రం వయసు పెరుగుతున్నా ఎత్తు మాత్రం అస్సలు పెరగరు. పిల్లల ఎత్తు పెంచడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు వయసుకు తగ్గట్టు వయసు పెరగడం లేదని బాధపడిపోతుంటారు. పొట్టిగా పిల్లలను పెద్దలతో పాటుగా తోటి పిల్లలు కూడా పొట్టి పొట్టి అని ఎగతాళి చేస్తుంటారు. ఇది జోక్ గా అనిపించినా.. ఇది  పిల్లల్ని ఎంతో బాధిస్తుంది. మానసిక వేధనకు గురిచేస్తుంది. పిల్లల బాధ చూడలేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఎత్తును ఎలా పెంచాలని చాలా మందిని అడుతుంటారు. అయితే తల్లిదండ్రులు కొన్ని పనులు పనులు చేస్తే మీ పిల్లల ఎత్తును సులువుగా పెంచొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


మీ పిల్లల ఎత్తును పెంచాలనుకునే ముందుగా మీ పిల్లల వయస్సుకు ఎత్తు ఉన్నారా? లేదో? తెలుసుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైల్డ్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో నమోదు చేస్తే బిడ్డ వయసుకు తగిన ఎత్తులో ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకోసారి పిల్లల ఎత్తును చెక్ చేసుకోవాలి. 


మీ పిల్లల ఎత్తు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటానికి మూడు కారణాలున్నాయి. అవేంటంటే? 

బలహీనత/హార్మోన్ల లోపం
కుటుంబ చరిత్ర
పోషకాహార లోపం

చాలా మంది తల్లులు పిల్లలు బాగా తింటే ఎత్తు పెరుగుతారని అనుకుంటుంటారు. కానీ అందులో ఇంత కూడా నిజం లేదు. పై మూడు కారణాలతో పాటుగా పిల్లల తల్లిదండ్రుల ఎత్తును కూడా లెక్కించాలి. పిల్లవాడు సగటున కొన్ని అంగుళాల పొడవు లేదా పొట్టిగా ఉండటం సర్వసాధారణ విషయం.
 

కొంతమంది పిల్లల ఎత్తును పదేళ్ల లోపే అంచనా వేయడం తప్పు.  ఎందుకంటే 10 సంవత్సరాల వయస్సులో తక్కువ ఎత్తున్న పిల్లలు 18 సంవత్సరాల వయస్సులో బాగా పెరుగుతాడు. మీ పిల్లల ఎదుగుదల చిన్న వయసులో తక్కువగా ఉంటే దానికి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత పిల్లలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా ఎంతో మంది పెరుగుతున్నారు కూడా.  జెనెటిక్స్ లేదా కుటుంబ చరిత్ర కారణంగా హైట్ తక్కువగా ఉన్న పిల్లల ఎత్తును ఏం చేసినా పెంచలేరు. 

అలాగే పిల్లల ఎముకల పరిపక్వత, హార్మోన్ల రుగ్మతలను కూడా చెక్ చేయండి. ఎందుకంటే శిశువు ఎముక పరిపక్వత నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఆలస్యంగా పికప్ అయ్యే అవకాశం ఉంది. మీ పిల్లలకు అనారోగ్య సమస్యలుంటేనే మీరు ఆందోళన చెందాలి. కాగా బాగా ఫుడ్ పెట్టినంత మాత్రాన మీరు మీ పిల్లల ఎత్తును పెంచలేరు. 

పిల్లల ఎత్తును పెంచడానికి మీరు పిల్లలతో కొన్నిగేమ్స్ ను ఆడించాలి. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి గేమ్స్ ఆడితే కూడా మీ పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. ఈ ఆటలు హార్మోన్ల కార్యకలాపాలను పెంచుతాయి. అలాగే పిల్లల పెరుగుదలకు సహాయపడతాయి.

Latest Videos

click me!