ముఖేష్ అంబానీ, నీతా అంబానీల నుంచి ప్రతి పేరెంట్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి..

First Published Jul 18, 2024, 2:37 PM IST

ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు పిల్లల పెంపకం విషయంలో ప్రతి ఒక్కరూ వీరిని ముచ్చుకున్నవారే.  ఎందుకంటే వీరి పిల్లలు అంత సంస్కారవంతులు, మర్యాదస్తులు. ప్రపంచంలోని టాప్ 10 సంపనుల్లో చోటు దక్కించుకున్నా ముఖేష్ అంబానీ పిల్లల పెంపకం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు. అందుకే వీరు ప్రతి తల్లిదండ్రులకు ఆదర్శం. 
 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లీ ఈ మధ్యే జరిగింది. ఈ సంపన్నుల పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందంటే.. ప్రపంచం నలుమూలల నుంచి బడా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి వ్యాపార వేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం మంచి లగ్జరీ లైఫ్ కు మాత్రమే కాదు..  ఎన్నో ఆచారాలకు కూడా ప్రసిద్ది చెందింది. ముఖ్యంగా నీతా అంబానీ, ముఖేష్ అంబానీల పిల్ల లపెంపకాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. వీళ్లది ధనవంతుల కుటుంబమే అయినా.. పిల్లల్ని ఎంతో వినయంగా, మర్యాదగా, లోకం మెచ్చేలా పెంచారు. నీతా, ముఖేష్ అంబానీల పిల్లల పెంపకం నుంచి ప్రతి తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పిల్లలకు ట్రూ ఫ్రెండ్ గా.. 

ముఖేశ్ అంబానీ, ఈయన భార్య నీతా అంబానీలు పిల్లలకు కేవలం తల్లిదండ్రులుగానే కాకుండా.. వారికి బెస్ట్ ఫ్రెండ్ లా కూడా ఉంటారు. ఈ జంట తమ ముగ్గురు పిల్లలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి ఆరోగ్యకరమైన, బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా గౌరవిస్తారు.  బంధానికి విలువ తెసుకుంటారు. అందుకే అంబానీ ఫ్యామిలీకి బంధాల విలువ, ప్రాముఖ్యతలు బాగా తెలుసు. దీనివల్ల వీళ్లు భవిష్యత్తులో ప్రతి సంబంధాన్ని గౌరవిస్తారు. మీకు తెలుసా? పేరెంట్స్ పిల్లలలో ఫ్రెండ్లీగా ఉంటే.. పిల్లలు పేరెంట్స్ తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. మనసులో ఏదీ దాచుకోరు. అలాగే ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు. 
 

Latest Videos


వినయాన్ని నేర్పడం.. 

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పిల్లలు.. ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ఉంటారు. దేశంలో ఇంత సంపన్న కుటుంబంలో పుట్టినా.. ఈ ముగ్గురూ ఎప్పుడూ వినయంగానే ఉంటారు. ఇవి వారి పిల్లలకు ఇచ్చిన ఆచారాలు. ఆకాశ్ తప్పు చేస్తే ముఖేష్ అంబానీ వెళ్లి తన వాచ్ మెన్ కు క్షమాపణలు చెప్పారని ఓ ఇంటర్వ్యూలో  నీతా అంబానీ చెప్పారు. అందుకే పిల్లల్ని వినయంగా పెంచడాన్ని వీరిని చూసి నేర్చుకోవాలి. పిల్లలు వినయంగా ఉంటేనే వీరిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు.
 

ఆత్మవిశ్వాసం నింపాలి..

పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఈ పనిని తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. తల్లిదండ్రులు తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తారని అనంత్ అంబానీ ఓ ఇంటర్యూలో చెప్పారు. నమ్మకం, ధైర్యంతో ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా చేరొచ్చేని అనంత్ అంబానీ అంటారు. పిల్లలు తప్పులు చేస్తున్నారని వారిని అలాగే వదిలేయకుండా వారిని మంచి మార్గంలో నడపాలి. అన్ని వేళలా తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండటాన్ని ఈ జంటను చూసి నేర్చుకోవాలి.


డబ్బు విలువ.. 

అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి పిల్లలకు డబ్బుకు ఎలాంటి లోటూ లేదు. ఎంత డబ్బైనా తీసుకోవచ్చు. ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. కానీ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఎప్పుడూ ఇలా చేయలేరు. ముందుగా వీళ్లు తమ పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పారు. మీకు తెలుసా? ఇంత సంపద ఉన్నా.. ముఖేష్, నీతా అంబానీలు తమ పిల్లలకు పెద్దగా పాకెట్ మనీ ఇవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది. పిల్లలు చిన్నతనం నుంచే డబ్బు విలువను అర్థం చేసుకోవాలని, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలని ప్రతి తల్లిదండ్రులు వీరి నుంచి నేర్చుకోవాలి.

click me!