పిల్లల్ని బెదిరిస్తే ఏం జరుగుతుంతో తెలుసా?

First Published | Feb 29, 2024, 3:53 PM IST

తల్లిదండ్రులకున్న కొన్ని అలవాట్లు పిల్లల్ని ఎంతో బాధపెడతాయి. ముఖ్యంగా ఇవి మీ పిల్లల్ని ఒంటరిగా ఉండేలా చేస్తాయి. అలాగే తల్లిదండ్రులంటే భయపడేలా చేస్తాయి. ఇంతకీ ఆ అలవాట్లేంటంటే..
 

నేటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అలాగే తమ పిల్లల గురించి చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. వేరే పిల్లల కంటే మా పిల్లలే అన్నింట్లో ముందుండాలని కోరుకుంటున్నారు. కానీ ఇందుకోసమని తల్లిదండ్రులు తమకు తెలియకుండానే పిల్లల్ని హర్ట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి పనులు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. అందుకే తల్లిదండ్రులకున్న ఏ అలవాట్లు పిల్లల్ని బాధపెడతాయో? వారి భవిష్యత్తును నాశనం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బెదిరింపు

తప్పు చేసినప్పుడు లేదా చదువులో వెనకబడ్డప్పుడు చాలా మంది తల్లిందండ్రులు పిల్లల్ని బెదిరిస్తుంటారు. కానీ ఈ బెదిరింపు పిల్లల్ని ఎంతో  భయపెడుతుందది. ఇది చిన్న పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఊహించలేరు. తల్లిదండ్రులు తరచుగా పిల్లల్ని బెదిరిస్తే వాళ్లు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. 
 


ఎగతాళి

తమ పిల్లలకంటే వేరే పిల్లలు బాగా చదివినిప్పుడు, మంచిగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లముందే తమ పిల్లల్ని ఎగతాళి చేస్తుంటారు. వాళ్లను చూసి నేర్చుకో అని తిడుతుంటారు. కానీ ఇది మీ పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచించకుండా పిల్లలను ఆటపట్టిస్తుంటారు. కానీ ఇది వారి మనస్సులో అలాగే ఉండిపోతుంది. ఇది మీ పిల్లల ఎదుగుదలకు అంత మంచిది కాదు. అందుకే మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. 
 

వారు చెప్పింది పట్టించుకోకపోవడం

చాలా మంది తల్లిదండ్రులు తాము చెప్పిందే పిల్లలు వినాలంటారు.. కానీ పిల్లలు చెప్పిన మాట మాత్రం చెవిన పెట్టరు. కొంతమంది ఏదో విన్నామా అనిపిస్తే.. మరికొంతమంది మాత్రం అసలు పిల్లలు చెప్పనీయరు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసన్ని తగ్గిస్తుంది. పిల్లల పెంపకంపైనే మీ పిల్లలు ఎలా ఉన్నారనేది ఆధారపడి ఉంటుంది. అసలు చాలా మంది పిల్లలకు ఏం కావాలో విడిచిపెట్టి.. నువ్వు ఇది చేయకూడదు. అది చేయాలని అని చెప్తుంటారు. ఇది వారి మనస్సుపై ప్రభావితం చూపిస్తుంది. దీనివల్ల మీ పిల్లలు సైలెంట్ అవుతారు. 
 

హింసాత్మకంగా ఉండటం

పిల్లలు తప్పు చేస్తే చాలు.. తిట్టేస్తునే ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. అదికూడా అందరిముందు. అలాగే కొంతమంది అయితే ఏకంగా కొడుతుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ పిల్లలకు మీపై చెడ్డ అభిప్రాయం వస్తుంది. అలాగే చాలా భయపడిపోతారు. తరచుగా పిల్లల్ని కొట్టడం వల్ల వారికి మీరంటే భయం తప్ప ప్రేమ ఉండదు. 

Latest Videos

click me!