పిల్లలు ఎత్తు పెరగడం లేదని ఫీలౌతున్నారా? ఈ ఫుడ్స్ పెట్టండి..!

First Published Feb 28, 2024, 2:55 PM IST

చాలా మందికి పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడితే  మంచిగా ఎత్తు పెరుగుతారు..? వారి ఎగుదల బాగుంటుంది అనే విషయాలపై క్లారిటీ ఉండదు. అందుకే నిపుణుల సహాయంతో.. పిల్లలు  ఏ ఆహారం తింటే వారి ఎదుగుల  బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు చాలా కంగారు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు బరువు పెరగకపోయినా, ఎత్తు పెరగకపోయినా  చాలా కంగారుపడుతూ ఉంటారు. సరిగా ఫుడ్ తినరని, అందుకే వయసు తగినట్లు ఎదగడంలేదు అని బాధపడుతూ ఉంటారు. అయితే.. చాలా మందికి పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడితే  మంచిగా ఎత్తు పెరుగుతారు..? వారి ఎగుదల బాగుంటుంది అనే విషయాలపై క్లారిటీ ఉండదు. అందుకే నిపుణుల సహాయంతో.. పిల్లలు  ఏ ఆహారం తింటే వారి ఎదుగుల  బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

milk

1.పాలు..

పిల్లల ఎదుగదలలో పాలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. పిల్లలు రోజూ పాలు తాగితే వారిలో మంచి ఎదుగుదల ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు పాలు తాగడానికి పెద్దగా ఇష్టపడరు.అయితే.. అదే పాలల్లో ఆరోగ్యకరమైన, పిల్లలు ఇష్టపడే పౌడర్లు కలిపి తాగించవచ్చు. లేదంటే పాల ఉత్పత్తులు కూడా వారి ఆహారంలో భాగం చేయవచ్చు.. అంటే పన్నీర్, చీజ్ లాంటివి పెట్టొచ్చు. 
 

2.ప్రోటీన్ రిచ్ ఫుడ్స్..
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం పిల్లలకు అందించడం వల్ల కూడా  పిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పులు, పన్నీర్, కోడిగుడ్డు,చికెన్, చేపలను వారి డైట్ లో భాగం చేయాలి. దీని వల్ల వారిలో మంచి ఎదుగుదల కనపడుతుంంది. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వారికి ప్రోటీన్ అందేలా చూడాలి.
 

3.యానిమల్ బేస్డ్ ఫుడ్...
పిల్లల ఎదుగుదలలో  ప్రోటీన్ ఎంత ముఖ్యమో, విటమిన్లు అంతే ముఖ్యం. అందులోనూ విటమిన్ డి చాలా అవసరం. ఇవి గుడ్డులో లభిస్తాయి. పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు వారి డైట్ లో భాగం చేయాలి. దాని వల్ల.. వారిలో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తొందరగా పిల్లలు ఎత్తు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
 

4.గ్రెయిన్స్...

అన్ని రకాల పప్పులను, గ్రెయిన్స్ పిల్లల ఆహారంలో భాగం చేయాలి. వట్టి గోధుమలు మాత్రమే కాకుండా.. హోల్ గ్రెయిన్స్ తో చేసిన పిండితో చపాతీలు చేయడం లాంటివి చేయాలి. ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్ లాంటివి కూడా పెట్టొచ్చు. వీటిలో ఫైబర్, విటమిన్స్, ఉంటాయి. వాటిని డైరెక్ట్ గా పెట్టకపోయినా.. ఏదో ఒక రూపంలో పిల్లల ఆహారంలో భాగం చేయాలి. అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదగలుగుతారు.
 

5.ఆకుకూరలు..
ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఆకు కూరలు పెట్టడం లేదు. కానీ, ఆకు కూరలు పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆకు కూరల్లో ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి... కచ్చితంగా వారానికి రెండు సార్లు అయినా.. పిల్లల కు ఆకుకూరలు పెట్టాలి.
 

dry fruits

6.డ్రై ఫ్రూట్స్..
ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా పిల్లల ఆహారంలో భాగం చేయాలి.  బాదం, చియా, వాల్ నట్స్  లాంటి వాటిని పిల్లల ఆహారంలో చేర్చాలి. నట్స్ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే.. కనీసం వాటిని పౌడర్ గా మార్చి అయినా.. వారి ఆహారంలో కలిపి పెట్టడం ఉత్తమం. ఇవి బ్రెయిన్ పెరుగులకు, శారీరక ఎదుగుదలకు చాలా కీలకంగా పని చేస్తాయి.
 

fruits

7.పండ్లు..
పిల్లలు ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ తింటున్నారు కానీ.. ఆరోగ్యకరమైన పండ్లను మాత్రం తినడం లేదు. అందుకే  ఎదుగుదలోనూ లోపాలు ఉంటున్నాయి. కాబట్టి.. పిల్లలకు కష్టమైనా సరే వారి ఆహారంలో పండ్లు ఉండేలా చూడాలి. ముఖ్యంగా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆరెంజ్, బెర్రీలు, బొప్పాయిలను వారికి పెట్టాలి. ఇవి పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.

click me!