పిల్లలు ఉదయం లేవగానే.. వాళ్లను బ్రష్ చెయ్యి, టిఫిన్ చెయ్యి.. స్కూల్ కి టైమ్ అవుతోంది అనే కంగారు పెట్టకూడదు. ముందు.. వాళ్లను ప్రేమగా దగ్గరకు తీసుకొని, చక్కగా కౌగిలించుకొని గుడ్ మార్నింగ్ చెప్పాలి. అది నువ్వుకుంటూ హ్యాపీ ఫేస్ తో చెప్పాలి. ఈ ఒక్క గుడ్ మార్నింగ్ పిల్లలు ఆ రోజంతా ఉత్సాహంగా, హ్యాపీగా ఉండటానికి సహాయపడుతుంది.