పిల్లల పెంపకం అంత సులువేమీ కాదు. చాలా సవాళ్లతో కూడుకొని ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో..? వారి ని ఎలా సముదాయించాలి..? వారికి ఎప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..? మంచి, చెడు నేర్పించడం ఎలా అనే విషయంలో పేరెంట్స్ సతమతమౌతూ ఉంటారు. ఈ క్రమంలో పిల్లలకు చెప్పాల్సిన విషయాలు మాత్రమే కాదు.. కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి. అవి కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. అసలు పొరపాటున కూడా పేరెంట్స్. తమ పిల్లలకు చెప్పకూడని విషయాలేంటో ఓసారి చూద్దాం..
1.పిల్లల ముందు పేరెంట్స్ బూతులు వాడకూడదు. కొందరు పేరెంట్స్ పిల్లలను పదునైన పదాలతో దూషిస్తారు. మరి కొందరు.. పిల్లలను తిట్టకపోయినా.. ఇతరులను అలాంటి పదాలు ఉపయోగిస్తారు. కానీ.. పొరపాటున కూడా అలాంటి పనులు చేయకూడదట.అంతేకాదు.. మరీ ఎక్కువ కోపం కూడా చూపించకూడదు. ఇవి పిల్లలను ఎమోషనల్ గా డ్యామేజ్ చేసేస్తాయి. తెలీకుండానే వారిలో భయం, ఒత్తిడి పెరిగిపోతాయి. ఫలితంగా వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి.
2.చాలా మంది పేరెంట్స్ పిల్లలకు ప్రతి విషయంలో బహుమతులు ఇస్తాం అంటారు. నువ్వు అది చేస్తే.. గిఫ్ట్ ఇస్తాం అని చెబుతూ ఉంటారు. దాని వల్ల పిల్లలు మంచి వాల్యూస్ నేర్చుకుంటారు అని అనుకుంటారు. అయితే.. ఇది మంచి విషయమే కానీ. ఇలా నేర్పించడం వల్ల పిల్లలు చాలా మెటీరియలిస్టిక్ గా తయారౌతారు. పిల్లలకు మంచి విలువలు నేర్పించేందుకు బహుమతులు ఇవ్వకూడదట. జెన్యూన్ గా వాళ్లు చేసే మంచి పనులను మెచ్చుకోవడం, మంచిగా పొగడం లాంటివి చేయాలి.
3.కొందరు పేరెంట్స్ ప్రతి విషయంలో తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తూనే ఉంటారు. ఏదో ఒక్కసారి అంటే అనుకోవచ్చు. అలా కాదు. ప్రతిసారీ అలానే చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిసారీ చేయడం వల్ల పిల్లలు తమ లో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు, పొరపాటున కూడా మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. ఏ విషయంలో నైనా వారిలో ఉన్న టాలెంట్ బయటకు తీయడానికి ప్రయత్నించాలి కానీ.. ఇతరలతో పోల్చి తక్కువ చేయవద్దు.
4.ఇక పిల్లలను తిట్టకూడదు అన్నారు కదా అని కొందరు పేరెంట్స్ అవసరం ఉన్నా లేకున్నా.. ప్రతి విషయంలోనూ తమ పిల్లలను పొగిడేస్తూ ఉంటారు. దీని వల్ల సహజత్వం లోపిస్తుంది. నిజంగా గొప్ప, మంచి పని చేస్తే మాత్రమే మెచ్చుకోవాలి.
5.ఇక కొందరు పేరెంట్స్ పిల్లలను ప్రతి విషయంలోనూ తెగ భయపెట్టేస్తూ ఉంటారు. ఆ పని చెయ్యకపోతే.. ఇలా చేస్తాను, అలా చేస్తాను అని బెదిరిస్తారు. బెదిరించి పిల్లలతో పనులు చేపించకూడదు. ప్రేమగా వారికి అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి.
Parenting Tips- These talkative parents are always liked by children
6.ఇక కొందరు.. పిల్లలను దారుణంగా విమర్శిస్తూ ఉంటారు. పర్సనల్ ఎటాక్ చేస్తూ ఉంటారు. తమ పిల్లలను మాత్రమే.. వేరే వాళ్ల పిల్లలను సైతం పర్సనల్ ఎటాక్ చేయకూడదు.
7.పిల్లలు ఏడ్వడం సహజం. వారికి బాధ వస్తే ఏడ్వకుండా ఎలా ఉంటారు.. కొందరు పేరెంట్స్.. పిల్లలు ఏడుస్తుంటూ ఊరుకోరు. ఏడ్వద్దు.. గొంతు బయటకు వచ్చిందే ఊరుకోను అని సీరియస్ అవుతూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయవద్దు.
8.ఇక కొందరు పేరెంట్స్ ఫేక్ ప్రామిస్ లు చేస్తూ ఉంటారు. కనీసం ఆ ప్రామిస్ లు రియలస్టిక్ గా కూడా ఉండవు. దీని వల్ల.. పోయే కొద్ది.. వాళ్లకు మీ మీద నమ్మకం పోతుంది.కాబట్టి.. ఫేక్ ప్రామిస్ లు చేయకూడదు.