parenting tips
వాస్తు శాస్త్రం ప్రకారం.. పసిపిల్లల గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం.. పసిబిడ్డ దగ్గర ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి వారి శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు మీ బిడ్డ దగ్గర ఏం ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముళ్ల మొక్కలు
ఈ మొక్కల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్కలు అందంగా ఉంటాయి. ఇంటిని అందంగా కనిపించేలా చేస్తాయి.అందుకే చాలా మంది ముళ్ల మొక్కలను కూడా గార్డెన్ లో పెంచుతుంటారు. కానీ వీటికి పదునైన ముళ్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే సమస్యలు వస్తాయి.అలాగే వాస్తు ప్రకారం.. ఈ మొక్కలు చెడు శక్తిని తెస్తాయి. ఇది మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది. వారిని అసౌకర్యానికి గురి చేస్తుంది.
అద్దాలు
ప్రతి ఒక్కరి ఇళ్లలో అద్దాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం.. చిన్న పిల్లలను అద్దంలో చూపించకూడదు. మీ పిల్లలున్న గదిలో అద్దాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే గాజు శక్తిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇది పిల్లలకు చంచలతను కలిగిస్తుంది. ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది.
విరిగిన బొమ్మలు
వాడుతున్న కొద్దీ బొమ్మలు విరగడం, పగిలిపోవడం జరుగుతుంటుంది. ఇది సర్వ సాధారణ విషయం. అయినప్పటికీ.. విరిగిన బొమ్మలను మీ పిల్లలు ఉన్న చోట ఉంచకండి. వాస్తు ప్రకారం ఇది వారికి చెడు వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇది వారి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రతికూల పెయింటింగ్స్
మీ పిల్లల గదికి పెయింటింగ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. హింసాత్మక లేదా ఇబ్బందికరమైన శీర్షికలను చిత్రీకరించే పెయింటింగ్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా మీ బిడ్డకు ప్రేమపూర్వక వాతావరణాన్ని అందించడానికి ఉల్లాసకరమైన, ఉత్సాహభరితమైన పెయింటింగ్ లను వేయాలి. అలాగే ఆనందంగా, ఆశను వ్యక్తపరిచే చిత్రాలను కూడా పిల్లల గదిలో ఉంచొచ్చు.
భారీ చెక్క ఫర్నిచర్
పిల్లలున్న గదిలో బరువైన వస్తువులను ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం.. ఎక్కువ స్పేస్ లేకుండా ఉంటే స్వేచ్ఛగా శక్తి ప్రవాహం తగ్గుతుంది. ఇది మీ బిడ్డకు అసౌకర్యం కలిగిస్తుంది.